Site icon HashtagU Telugu

BCCI: చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్‌… ఏకగ్రీవంగా ఎంపిక చేసిన CAC

Ajit Agarkar

Ajit Agarkar

Ajit Agarkar: బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ ఎంపికయ్యాడు. గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న చీఫ్ సెలక్టర్ పదవి కోసం బీసీసీఐ ఇటీవలే దరఖాస్తులు ఆహ్వానించింది. అప్లై చేసుకున్న వారిని ఇంటర్యూ చేసిన బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ అగార్కర్‌కు ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెలక్టర్ రేసులో అగార్కర్ మొదటి నుంచీ ముందు వరుసలో నిలిచాడు. దీని కోసమే ఢిల్లీ క్యాపిటల్స్‌తో కోచింగ్ కాంట్రాక్ట్ కూడా రద్దు చేసుకున్నాడు.

అగార్కర్ భారత్ తరపున 26 టెస్టులు, 191 వన్డే ఆడాడు. టీమిండియా తరఫున 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20లు ఆగార్కర్‌ ఆడాడు. 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులోనూ అతడు ఉన్నాడు. 2000 నుంచి 2010 మధ్య టీమిండియాలో కీలక ఆటగాడిగా అగార్కర్ కొనసాగాడు

గతంలోనే ఓసారి ఈ పదవి కోసం ప్రయత్నించిన అజిత్ అగార్కర్ అప్పుడు ఎంపిక కాలేకపోయాడు. ఐపీఎల్‌-2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న అగార్కర్‌ జూన్ 29న తన పదవికి రాజీనామా చేశాడు. ఇటీవలే క్రికెట్‌ సలహా కమిటీ దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులను ఇంటర్వ్యూ నిర్వహించింది. గత ఫిబ్రవరిలో వివాదాస్పద కారణాలతో చేతన్‌ పదవికి రాజీనామా చేశాడు.

అప్పటి నుంచి సెలక్షన్‌ కమిటీలో చీఫ్‌ సెలక్టర్‌ పోస్టు ఖాళీగా ఉంది. దిల్లీ క్యాపిటల్స్‌తో బంధం తెంచుకోవడం, ఈసారి కూడా దరఖాస్తు చేసుకోవడంతో ఈ సారి అజిత్‌ అగార్కర్‌కు చీఫ్‌ సెలక్టర్‌ ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా మొన్నటి వరకూ చీఫ్ సెలక్టర్‌గా ఉన్న చేతన్ శర్మ ఓ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో బీసీసీఐ అంతర్గత వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేసి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే చీఫ్ సెలక్టర్‌కు కోటి రూపాయలు, మిగిలిన సెలక్టర్లకు 90 లక్షల వరకూ వేతనం ఇచ్చేందుకు బీసీసీఐ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ విండీస్‌తో టీ ట్వంటీ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేయనుంది. ప్రస్తుతం బీసీసీఐ సెలక్షన్ కమిటీలో శివసుందర్‌దాస్, సుబ్రతో బెనర్జీ, సాలిల్ అంకోలా, శ్రీధరన్‌ శరత్ సభ్యులుగా ఉన్నారు.