Former England Captain: జనవరి 22 నుండి శ్రీలంకతో జరగనున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు సిద్ధమవుతున్న వేళ ఆ జట్టులో తీవ్ర విషాదం నెలకొంది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నార్మన్ గిఫోర్డ్ కన్నుమూశారు. 85 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. నార్మన్ గిఫోర్డ్ 1964 నుండి 1973 వరకు ఇంగ్లాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన అంతర్జాతీయ స్థాయిలో తక్కువ మ్యాచ్‌లే ఆడినప్పటికీ దేశీయ క్రికెట్‌లో అసాధారణ రికార్డులను సృష్టించారు. విశేషమేమిటంటే ఆయన తన 44 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు.
కెరీర్‌లో 2548 వికెట్లు
గిఫోర్డ్ 1964- 1965లో వోర్సెస్టర్‌షైర్ కౌంటీ ఛాంపియన్‌షిప్ గెలిచిన జట్లలో కీలక సభ్యుడిగా ఉన్నారు. 1960 నుండి 1988 మధ్య ఆయన ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. ఒక బౌలర్‌గా ఆయన గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి.
Also Read: భోజనం తర్వాత నిద్ర ఎందుకు వస్తుంది?
- టెస్ట్ క్రికెట్: 15 మ్యాచ్‌లలో 33 వికెట్లు.
- వన్డే క్రికెట్: 3 మ్యాచ్‌లలో 4 వికెట్లు.
- ఫస్ట్ క్లాస్ క్రికెట్: 710 మ్యాచ్‌లలో 2068 వికెట్లు.
- లిస్ట్-A క్రికెట్: 443 వికెట్లు. మొత్తంగా అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ కలిపి ఆయన 2548 వికెట్లు పడగొట్టారు.
పాకిస్థాన్‌పై కెప్టెన్‌గా
44 ఏళ్ల వయసులో షార్జాలో జరిగిన ‘రోత్మన్ ఫోర్-నేషన్స్ కప్’లో రెండు వన్డే మ్యాచ్‌లకు ఆయన ఇంగ్లాండ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. పాకిస్థాన్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో ఆయన అద్భుతంగా బౌలింగ్ చేసి, 10 ఓవర్లలో కేవలం 23 పరుగులిచ్చి 4 వికెట్లు తీశారు. టెస్ట్ క్రికెట్‌లో కరాచీ వేదికగా పాకిస్థాన్‌పై 55 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం ఆయన అత్యుత్తమ ప్రదర్శన. క్రికెట్‌కు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1975లో ‘విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికయ్యారు. 1978లో MBE గౌరవాన్ని అందుకున్నారు.
