టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (Vinod Kambli) ఆరోగ్యం (Health Critical) మరింత విషమించింది. ప్రస్తుతం థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి అత్యంత క్రిటికల్‌గా ఉందని సమాచారం. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కాంబ్లీ, గతంలోనూ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. కాంబ్లీ ఆరోగ్య సమస్యలు గత కొంతకాలంగా తీవ్రతరం కావడంతో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తూ వస్తున్నారు.ఇక ఇప్పుడు అనారోగ్యం ఎక్కువ కావడం తో ఐసీయూలో ఉంచి చికిత్స కొనసాగిస్తున్నారు.
క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత కాంబ్లీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఆర్థిక సంక్షోభం కారణంగా ఆయన గతంలో పని కోసం సినీ రంగం మరియు కోచింగ్ వైపు అడుగులు వేశారు. కానీ ఎక్కడ వర్క్ అవుట్ కాలేదు. దీంతో ఆర్ధిక సమస్యలు ఎక్కువై , ఆయన్ను మరింత అనారోగ్యానికి గురి చేసింది. ప్రస్తుతం కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న వార్త క్రికెట్ అభిమానుల్లో ఆందోళన రేకెత్తించింది. సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్లతో పాటు పలువురు ప్రముఖులు కాంబ్లీ ఆరోగ్యం పై తమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. వినోద్ కాంబ్లీ భారత క్రికెట్‌లో గుర్తుండిపోయే ఆటగాళ్లలో ఒకరు. తన అత్యద్భుత బ్యాటింగ్ ప్రదర్శనలతో భారత జట్టుకు అనేక విజయాలు అందించిన కాంబ్లీ, యువ క్రికెటర్లకు స్ఫూర్తి.
Read Also : Vande Bharat : దారి తప్పిన వందే భారత్ ట్రైన్.. గోవాకు వెళ్లాల్సిన రైలు కాస్త..!