Bishan Singh Bedi : స్పిన్ లెజెండ్ బిషన్‌సింగ్ బేడీ ఇక లేరు

Bishan Singh Bedi : క్రికెట్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ (77)  ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు.

Published By: HashtagU Telugu Desk
Bishan Singh Bedi

Bishan Singh Bedi

Bishan Singh Bedi : క్రికెట్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ (77)  ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. బిషన్ సింగ్ బేడీ మరణం పట్ల భారత క్రికెటర్లు, మాజీ ప్లేయర్లు సంతాపం వ్యక్తం చేశారు. ఇండియన్ క్రికెట్‌కు స్పిన్ లెజెండ్ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ స్పిన్నర్  బిషన్ సింగ్ బేడీ అమృత్‌సర్‌లో జన్మించారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన బేడీ.. 1967 నుంచి 1979 మధ్య ఇండియా క్రికెట్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించారు. ఇండియాకు 22 మ్యాచ్‌లలో కెప్టెన్ గా వ్యవహరించారు. 12 ఏళ్లలో టీమిండియా తరుపున 67 టెస్టులు ఆడిన బేడీ 266 వికెట్లు సాధించారు. పది వన్డేలలో ఏడు వికెట్లు తీశారు.

We’re now on WhatsApp. Click to Join.

1975 ప్రపంచకప్‌లో భాగంగా ఈస్ట్ ఆఫ్రికాతో తలపడిన భారత్.. 120 రన్స్  తేడాతో ఆ టీమ్ ను చిత్తుచేసి వన్డేలలో తొలి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో 12 ఓవర్లు బౌలింగ్ చేసిన బిషన్ సింగ్ బేడీ..8 మెయిడెన్ ఓవర్లు చేయగలిగారు. మొత్తం 12 ఓవర్లలో ఆరు పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశారు. ఇక కెరీర్ ప్రారంభంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆయన 370 మ్యాచ్‌లలో 1560 వికెట్లు తీశారు. రిటైర్మెంట్ తర్వాత పలువురు వర్ధమాన క్రికెటర్లకు కోచ్ గా, మెంటార్‌గా పనిచేశారు. కామెంటేటర్‌గానూ క్రికెట్‌తో తన అనుబంధాన్ని కొనసాగించారు. 1990లో న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లలో పర్యటించిన భారత జట్టుకు మేనేజర్‌గానూ వ్యవహరించారు. జాతీయ సెలెక్టర్‌గా, మెంటార్‌గా వ్యవహరిస్తూ మురళీ కార్తీక్, మణిందర్ సింగ్ లాంటి బౌలర్లను వెలుగులోకి (Bishan Singh Bedi) తీసుకొచ్చారు.

Also Read: TDP- Janasena : టీడీపీ-జనసేన భేటీలో 3 కీలక తీర్మానాలివే..

  Last Updated: 23 Oct 2023, 08:48 PM IST