Site icon HashtagU Telugu

IPL 2023: పంజాబ్‌ కింగ్స్ కీలక నిర్ణయం.. ఏమిటంటే..?

Punjab Kings

Punjab Kings

IPL-2023కు ముందు పంజాబ్‌ కింగ్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్‌ను తమ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా పంజాబ్‌ కింగ్స్‌ నియమించింది. కాగా సెప్టెంబర్‌లో ట్రెవర్ బేలిస్‌ను జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా పంజాబ్‌ నియమించిన సంగతి తెలిసిందే. కాగా గతంలో వీరిద్దరూ కలిసి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కోచింగ్‌ స్టాప్‌గా పనిచేశారు.

ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ హాడిన్ 66 టెస్టులు, 126 ODIలు, 34 T20లలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. అనిల్ కుంబ్లే స్థానంలో ట్రెవర్ బేలిస్‌ను కొత్త ప్రధాన కోచ్‌గా నియమించిన తర్వాత పంజాబ్ బ్రాడ్ హాడిన్‌ను తమ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా నియమించుకుంది. హాడిన్, బేలిస్ ఇద్దరూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో కూడా విధులు నిర్వహించారు. “హాడిన్‌ను సహాయ కోచ్‌గా నియమించాం. మిగిలిన సహాయక సిబ్బందిని త్వరలో నియమిస్తాం” అని ఐపిఎల్ వర్గాలు గురువారం తెలిపాయి.

భారత అనుభవజ్ఞుడైన అనిల్ కుంబ్లే స్థానంలో పంజాబ్‌ ప్రధాన కోచ్‌గా బేలిస్ నియమితుడయ్యాడు. కుంబ్లే మూడేళ్ల పదవీకాలంలో జట్టు ప్లేఆఫ్‌లకు చేరుకోవడంలో విఫలమైన తర్వాత అతని కాంట్రాక్ట్ ను పంజాబ్ జట్టు పునరుద్ధరించబడలేదు. 2019లో ఇంగ్లండ్‌కు తొలి ODI ప్రపంచ కప్ టైటిల్‌ను అందించడమే కాకుండా.. 2012, 2014లో IPL గెలిచినప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్ సహాయక సిబ్బందికి బేలిస్ నాయకత్వం వహించాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి పేలవ ప్రదర్శన కనబర్చిన పంజాబ్ గత నాలుగు సీజన్లలో ఆరో స్థానంలో నిలిచింది.