Site icon HashtagU Telugu

Fitness Test: కేఎల్ రాహుల్ సహా కొంతమంది ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై సస్పెన్స్?!

Fitness Test

Fitness Test

Fitness Test: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా సహా పలువురు భారత క్రికెటర్లు ఇటీవల నిర్వహించిన బ్రాంకో ఫిట్‌నెస్ టెస్ట్‌లో (Fitness Test) ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా విరాట్ కోహ్లీ కూడా ఇంగ్లాండ్‌లో ఈ పరీక్షను పూర్తి చేసి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నారని వార్తలు వచ్చాయి.

కేఎల్ రాహుల్ సహా కొంతమంది ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై సస్పెన్స్

ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు తమ ఫిట్‌నెస్ టెస్ట్‌లను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు.

Also Read: CM Revanth Reddy: రేపు కామారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్‌.. షెడ్యూల్ ఇదే!

అయితే ‘దైనిక్ జాగరణ్’ నివేదిక ప్రకారం.. కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే పాక్షిక ఫిట్‌నెస్ టెస్ట్ జరిగింది. వారు సెప్టెంబర్‌లో మరోసారి పూర్తిస్థాయి పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ జాబితాలో కేఎల్ రాహుల్, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి, రిషభ్ పంత్ వంటి ప్రముఖ ఆటగాళ్లు ఉన్నారు. గాయం లేదా అనారోగ్యం కారణంగా ఫిట్‌నెస్ టెస్ట్ ఇవ్వలేని ఇతర ఆటగాళ్లు కూడా ఈ పరీక్షల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రస్తుతం రిషభ్ పంత్ తన గాయం నుంచి కోలుకుంటున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆయన కుడి కాలి వేలికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం.

కోహ్లీ ఇంగ్లాండ్‌లో టెస్ట్ పాస్

విరాట్ కోహ్లీ తన ఫిట్‌నెస్ టెస్ట్‌ను ఇంగ్లాండ్‌లో పూర్తి చేసుకున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. కోహ్లీ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లండన్‌లో ఉన్నారు. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్‌లో కోహ్లీ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. కోహ్లీ మినహా మిగిలిన ఆటగాళ్లంతా తమ ఫిట్‌నెస్ టెస్ట్‌లను భారతదేశంలోనే పూర్తి చేసుకున్నారు. ఈ విషయంలో బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. కోహ్లీ ఇంగ్లాండ్‌లో టెస్ట్ ఇచ్చేందుకు తప్పకుండా ముందుగా అనుమతి తీసుకుని ఉంటారని తెలిపారు.

Exit mobile version