Site icon HashtagU Telugu

Rohit Sharma: సిరీస్‌కు అడుగుదూరంలో భారత్‌

Rohit Sharma To Open

Rohit Sharma To Open

కరేబియన్ టూర్‌లో మరో సిరీస్ విజయంపై భారత్ కన్నేసింది. వన్డే సిరీస్ తరహాలోనే తన జోరు కొనసాగిస్తున్న టీమిండియా ఇప్పుడు టీ ట్వంటీ సిరీస్‌కు అడుగుదూరంలో నిలిచింది. ఇవాళ ఫ్లోరిడా వేదికగా జరగనున్న మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరెట్‌గా చెప్పొచ్చు. చివరి రెండు మ్యాచ్‌లూ ఫ్లోరిడాలోనే జరగనుండగా ఒక్కటి గెలిచినా సిరీస్ భారత్ వశమవుతుంది. బలబలాలు, ఫామ్ పరంగా భారత్‌దే పైచేయిగా ఉన్నప్పటకీ… రెండో మ్యాచ్‌లో పుంజుకుని సిరీస్ సమం చేసిన విండీస్‌ను తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి.

కెప్టెన్ రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకోవడం ఫ్యాన్స్‌కు సంతోషాన్నిస్తోంది. ఇప్పటికే సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఇవాళ గెలిస్తే సిరీస్ చేజిక్కించుకుంటుంది. ఒకవేళ విండీస్ గెలిస్తే మాత్రం చివరి మ్యాచ్ సిరీస్‌ను డిసైడ్ చేయనుంది. ప్రత్యర్థికి ఇలాంటి అవకాశం ఇవ్వకుండా నాలుగో మ్యాచ్‌తోనే సిరీస్ గెలుచుకోవాలని రోహిత్‌సేన పట్టుదలగా ఉంది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్, రిషబ్ పంత్ ఫామ్‌లోకి రావడం అడ్వాంటేజ్‌గా చెప్పొచ్చు. బౌలింగ్ పరంగా సీనియర్ భువనేశ్వర్‌కుమార్ నిలకడగా రాణిస్తుండడం కలిసొచ్చే అంశం.^అలాగే హార్థిక్ పాండ్యా, అర్షదీప్‌సింగ్ ఆకట్టుకుంటున్నారు. షార్ట్ ఫార్మాట్‌లో భీకరమైన బ్యాటింగ్‌తో రెచ్చిపోయే విండీస్‌ను కట్టడి చేయడంలో వీరంతా విజయవంతమయ్యారు. దీంతో మరోసారి బౌలర్లపైనే అంచనాలున్నాయి.

మరోవైపు సిరీస్ చేజారకుండా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో విండీస్‌కు గెలుపు తప్పనిసరి. వన్డే సిరీస్‌లో పెద్దగా పోటీనివ్వలేకపోయిన కరేబియన్లు టీ ట్వంటీల్లో మాత్రం పర్వాలేదనిపిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో భారత్‌ను నిలవరించారు. అయితే రెండో టీ ట్వంటీలో బ్యాటర్ల వైఫల్యంతో పరాజయం తప్పలేదు. దీంతో నాలుగో టీ ట్వంటీలో గెలిచి సిరీస్ సమం చేయాలని విండీస్ పట్టుదలగా ఉంది. ఇదిలా ఉంటే మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న ఫ్లోరిడాలోని లాండర్‌హిల్ పిచ్‌ టీ20 ఫార్మట్‌కు పూర్తి అనుకూలిస్తుంగి. అమెరికాలో క్రికెట్‌కు ఆదరణ పెంచే ఉద్ధేశంతో అక్కడ మ్యాచ్‌లు ఏర్పాటు చే