Mumbai Indians: ముంబై ఇండియన్స్ కు తొలి ఓటమి… కీలక మ్యాచ్ లో గెలిచిన యూపీ

మహిళల ఐపిఎల్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారిన వేళ ప్రతి జట్టూ చివరి వరకూ పోరాడుతున్నాయి. తాజాగా కీలక మ్యాచ్ లో యూపీ వారియర్ సత్తా చాటింది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో టైటిల్ ఫేవరెట్ ముంబైకి పాక్ ఇచ్చింది.

  • Written By:
  • Publish Date - March 18, 2023 / 07:28 PM IST

Mumbai Indians: మహిళల ఐపిఎల్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారిన వేళ ప్రతి జట్టూ చివరి వరకూ పోరాడుతున్నాయి. తాజాగా కీలక మ్యాచ్ లో యూపీ వారియర్ సత్తా చాటింది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో టైటిల్ ఫేవరెట్ ముంబైకి పాక్ ఇచ్చింది. యూపీ వారియర్డ్ క్రికెటర్ సోఫియా ఎక్జిస్టోన్ ఆల్: రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబైని యూపీ బౌలర్లు 127 పరుగులకే కే కట్టడి చేశారు. లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేయడంతో ముంబై బ్యాటర్లు పరుగుల కోసం శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో అంచనాలు పెట్టుకున్న వారంతా నిరాశపరిచారు. వరుస వికెట్లు తీస్తూ యూపీ ఒత్తిడి పెంచడంతో | భారీస్కోర్ చేయలేకపోయింది. ముఖ్యంగా సాఫీ ఎక్లెన్ అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టింది. 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చిన సోఫీ మూడు వికెట్లు పడగొట్టింది. రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ముంబై బ్యాటర్లలో ఓపెనర్ హేలీ మాథ్యూస్ చేసిన 33 పరుగులే టాప్ స్కోర్. హేలీ ఒక ఫోర్. 3 35 పరుగులు చేయగా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ 25 పరుగులు చేసింది. ముంబై ఇన్నింగ్స్ లో కి ముంది. సింగిల్. డిజిట్ స్కోర్ డాటలేకపోయారు. I

అయితే చేజింగ్ లో యూపీ కూడా తడబడింది. కేవలం 217 పరుగులకే 3 కీలక వికెట్లు చేజార్చుకుంది. దేనికి 1. హీలీ 8. కిరణ్ 12 రన్స్ కే ఔటయ్యారు. ఈ దశలో తాహిలా మెక్ గ్రాత్, గ్రేస్ హ్యారిస్ యూపీని ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 44 పరుగులు జోడించారు. జూవాలా మెక్ గ్రాత్ 23 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 38. గ్రేస్ హ్యారిస్ 28 బంతుల్లో 7 ఫోర్లతో 39 రన్స్ చేశారు. చివర్లో ఎందరూ ఔటవడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా లేకపోవడంతో యూపీ ఒత్తిడికి గురి కాలేదు. దీప్తి శర్మ, సోఫీ ఎక్స్ప్రెస్టోన్ యూపీ విజయాన్ని పూర్తి చేశారు. చివరి ఓవర్లో సోఫీ సిక్సర్ కొట్టడంతో మరో 3 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకుంది. ఈ సీజన్ లో ముంబైకి ఇదే తొలి ఓటమి. ఇప్పటికే ఆ జట్టు ప్లే ఆఫ్ కు అర్హత సాధించింది. మరోవైపు ప్లే ఆఫ్ రేసులో నిలిచేందుకు కీలక మ్యాచ్ గెలిచిన యూపీ 6 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.