Site icon HashtagU Telugu

FIH Pro League: 24 మంది సభ్యులతో భారత మహిళల హాకీ జట్టు ప్ర‌క‌ట‌న‌.. కెప్టెన్ ఎవ‌రంటే..?

FIH Pro League

Safeimagekit Resized Img (9) 11zon

FIH Pro League: బెల్జియం- ఇంగ్లండ్‌లో జరగనున్న FIH ప్రో లీగ్ 2023-24 (FIH Pro League) కోసం 24 మంది సభ్యులతో కూడిన భారత మహిళల హాకీ జట్టును హాకీ ఇండియా ప్రకటించింది. హాకీ ఇండియా ఈ జట్టు కమాండ్‌ని జార్ఖండ్ కుమార్తె సలీమా టెటేకు అప్పగించింది. సలీమా టీం ఇండియా కెప్టెన్‌గా మారడం గర్వించదగ్గ విషయం. సలీమా టెటే ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కాకుండా జట్టులోని మరో ముగ్గురు ఆటగాళ్లు జార్ఖండ్‌కు చెందినవారు. FIH ప్రో లీగ్ 2023-24 సీజన్ మే 22 నుండి ప్రారంభం కానుంది.

సలీమా టెటే 22 ఏళ్ల వయసులో టీమ్‌ఇండియా కమాండ్‌ని అందుకుంది. సలీమా జార్ఖండ్‌లోని సిమ్‌డేగా జిల్లాలోని బద్కి ఛపర్ అనే చిన్న గ్రామ నివాసి. సలీమా తండ్రి రైతు. ఆమె తండ్రి కూడా స్థానిక హాకీ ఆటగాడు. సలీమా కూడా తండ్రిని చూసి హాకీని ఇష్టపడటం మొదలుపెట్టింది. అయితే సలీమాను హాకీ క్రీడాకారిణిగా మార్చడంలో సలీమా తల్లి, సోదరి కీలక పాత్ర పోషించారు. వాస్తవానికి సలీమా తల్లి, సోదరి ఇతర ఇళ్లలో వంట చేయడం, పాత్రలు కడగడం వంటి పనులు చేసేవారు. ఆరోజు వారి క‌ష్టంగా కార‌ణంగా నేడు ఆమెకు టీమ్ ఇండియా కమాండ్ వచ్చింది.

We’re now on WhatsApp : Click to Join

సలీమా సోదరి కూడా హాకీ క్రీడాకారిణి

సలీమా టెటే అక్క అనిమా టెటే కూడా హాకీ ప్లేయర్. కానీ చెల్లెలు సలీమా కోసం తన కలలను వదులుకుని వేరే ఇళ్లలో పని చేయడం ప్రారంభించింది. అయితే సలీమా చెల్లెలు మహిమ టెటే జార్ఖండ్‌కు చెందిన జూనియర్ మహిళల హాకీ జట్టుకు ఆడుతుంది.

Also Read: 5 Door Force Gurkha: ఫోర్స్ మోటార్స్ నుంచి ఎస్‌యూవీ.. ధ‌ర తెలిస్తే షాకే..!

సలీమా ప్రయాణం సాగింది ఇలా

సలీమా టెటే 2013లో సిమ్‌డేగాలో నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ హాకీ సెంటర్‌లో ఎంపికైంది. అయితే దీని తర్వాత రాష్ట్ర జట్టులో ఆడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత సలీమా తన సత్తా కారణంగా జాతీయ జట్టులో చోటు దక్కించుకుంది. ఆ తర్వాత సలీమా 2016 సంవత్సరంలో జూనియర్ హాకీ జట్టు ఆడుతూ అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. సలీమా టోక్యో ఒలింపిక్స్, వరల్డ్ కప్, కామన్వెల్త్ గేమ్స్ కూడా ఆడింది.

భారత మహిళల హాకీ జట్టు

సవితా పునియా, బిచ్చు దేవి ఖరీబమ్, నిక్కి ప్రధాన్, ఉదిత, ఇషికా చౌదరి, మోనికా, జ్యోతి ఛెత్రి, మహిమా చౌదరి, సలీమా టెటే (కెప్టెన్), వైష్ణవి విట్టల్ ఫాల్కే, నవనీత్ కౌర్, నేహా, జ్యోతి, బల్జీత్ కౌర్, మనీషా చౌహన్, సంగీత కుమార్, దీపిక, షర్మిలా దేవి, ప్రీతీ దేవి, వందనా కటారియా, సునేలితా టోప్పో, దీపికా సోరెంగ్.