Site icon HashtagU Telugu

FIFA : భారత ఫుట్ బాల్ పై ఫిఫా నిషేధం

Fifa

Fifa

అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ఫిఫా భారత్ కు షాక్ ఇచ్చింది. అఖిల భారతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ఏఐఎఫ్ఎఫ్ పై నిషేధం విధిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐఎఫ్ఎఫ్ లో బయటి వ్యక్తుల ప్రమేయం పెరిగిపోయిందనే కారణంగా ఫిఫా ఈ నిర్ణయం తీసుకుంది. వెంటనే ఈ నిషేధం అమలులోకి వస్తుందని ఫిఫా స్పష్టం చేసింది. ఫిఫా చట్టాలను తీవ్రంగా ఉల్లఘించిన కారణంగా ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఈ విషయంపై ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఫిఫా తాజా నిర్ణయం భారత ఫుట్‌బాల్ కు భారీ ఎదురుదెబ్బగా చెప్పాలి. భారత పురుషుల, మహిళల జట్లు అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడేందుకు వీళ్లేదు. జూనియర్, సీనియర్ స్థాయిలలో కూడా మ్యాచ్ లు రద్దవుతాయి. ముఖ్యంగా ఈ ఏడాది భారత్ వేదికగా జరగాల్సి ఉన్న ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు కూడా భారత్ కోల్పోయింది. అక్టోబర్ 11 నుంచి 30 వరకు భారత్ ఈ టోర్నీని నిర్వహించేందుకు గాను హక్కులు పొందింది. కాగా ఈ నిషేధం ఎంతకాలం కొనసాగుతుందనేది ఇంకా తెలియరాలేదు. దీంతో ఈ ఏడాది జరగాల్సి కువైట్ లో జరగాల్సి ఉన్న ఫిఫా వరల్డ్ కప్ తో పాటు వచ్చే ఏడాది ఏఎఫ్‌సీ ఆసియన్ కప్ – 2023 లో కూడా భారత్ పాల్గొనడం కష్టమే.
తమ చట్టాలను ఉల్లంఘిస్తూ.. ఏఐఎఫ్ఎఫ్ లో థర్డ్ పార్టీల జోక్యం ఎక్కువైందనే కారణంతో ఫిఫా ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య ఎగ్జిక్యూటీవ్ కమిటీ అధికారాలు కూడా రద్దు అయ్యాయని, సంస్థ రోజువారీ వ్యవహారాలపై ఏఐఎఫ్ఎఫ్ పాలకసంఘం తిరిగి పూర్తి నియంత్రణ పొందేందుకు నిర్వాహకుల కమిటీని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసింది. భారత క్రీడా మంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరుపుతోందని, ఈ కేసుకు సంబంధించి సానుకూల ఫలితం వచ్చేందుకు ఇంకా అవకాశముందని ఫిఫా తను విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.