FIFA on Sunil Chhetri:సునీల్ ఛైత్రికి ఫిఫా అరుదైన గౌరవం..!

భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచ్‌లలో యాక్టివ్ ప్లేయర్స్‌ల‌లో అత్యధిక గోల్స్ చేసిన మూడో ఆటగాడు.

  • Written By:
  • Publish Date - September 28, 2022 / 02:59 PM IST

భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచ్‌లలో యాక్టివ్ ప్లేయర్స్‌ల‌లో అత్యధిక గోల్స్ చేసిన మూడో ఆటగాడు. ఛెత్రి 131 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 84 గోల్స్‌తో క్రిస్టియానో ​​రొనాల్డో, మెస్సీల త‌ర్వాత‌ స్థానంలో ఉన్నాడు. ఛెత్రి విజయానికి గాను గ్లోబల్ ఫుట్‌బాల్ బాడీ భార‌త ఫుట్‌బాల్ కెప్టెన్‌కు సంబంధించిన‌ డాక్యుమెంటరీని ప్రారంభించింది.

ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ అసోసియేష‌న్ ఫుట్‌బాల్ (FIFA) భార‌త్ ఫుట్‌బాల్‌ కెప్టెన్‌పై “కెప్టెన్ ఫెంటాస్టిక్” పేరుతో ఒక డాక్యుమెంటరీ సిరీస్‌ను ప్రారంభించింది. మొదటి సీజన్‌లో ఛెత్రీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని వివరించే మూడు ఎపిసోడ్‌లు ఉంటాయి. ఈ వీడియో సిరీస్‌లో ఛెత్రి గురించి ఇంటర్వ్యూలు, ఇత‌ర అంశాలు ఉన్నాయి. 20 సంవత్సరాల వయస్సులో భారత్ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసినప్పటి నుండి భార‌త్ ఫుట్‌బాల్ జ‌ట్టు కెప్టెన్‌గా సునీల్ ఛెత్రి ఎదుగుదల కథాంశాన్ని ప్రదర్శించ‌నున్నారు.

ఈ మేర‌కు FIFA ట్విట్టర్‌లో.. “మీకు రొనాల్డో, మెస్సీ గురించి అన్నీ తెలుసు. ఇప్పుడు మూడవ అత్యధిక స్కోరింగ్ యాక్టివ్ మెన్స్ ఇంటర్నేషనల్ ఖచ్చితమైన కథనాన్ని పొందండి. సునీల్ ఛెత్రి కెప్టెన్ ఫెంటాస్టిక్ ఇప్పుడు FIFA+లో అందుబాటులో ఉంది.” అని ట్వీట్ చేసింది. భారత కెప్టెన్‌పై మూడు ఎపిసోడ్‌లకు ‘కిక్ ఆఫ్ (ఎపిసోడ్ 1)’, ‘మిడ్-గేమ్ (ఎపిసోడ్ 2)’ ఎక్స్‌ట్రా టైమ్ (ఎపిసోడ్ 3)’ అని పేరు పెట్టారు. వీడియో సిరీస్‌ను FIFA+లో మ‌నం చూడవచ్చు.