World Cup 2023: రోహిత్.. చూసుకోవాలి కదా

మెగాటోర్నీలో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తుంది. తొలి మ్యాచ్ లో ఆసీస్ ని చిత్తు చేసిన భారత ఆటగాళ్లు రెండో మ్యాచ్ ఆఫ్గనిస్తాన్ పై అదే జోరును కొనసాగించారు.

World Cup 2023: మెగాటోర్నీలో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తుంది. తొలి మ్యాచ్ లో ఆసీస్ ని చిత్తు చేసిన భారత ఆటగాళ్లు రెండో మ్యాచ్ ఆఫ్గనిస్తాన్ పై అదే జోరును కొనసాగించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ గౌరవప్రదమైన స్కోర్ రాబట్టింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 272 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆది నుంచే బ్యాట్ ఝళిపించారు.

ఓపెనర్ గా బరిలోకి దిగిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ జోడి శుభారంభాన్నిచ్చింది. కిషన్ మొదటి కాస్త తడబడినప్పటికీ రోహిత్ బాధ్యత తీసుకున్నాడు. ఎడాపెడా బాదడమే లక్ష్యంగా పెట్టుకుని ఆఫ్ఘన్ బౌలర్లని ఉతికారేశాడు. గత మ్యాచ్‌లో డకౌట్ అయ్యానన్న కసితో కనిపించిన రోహిట్ ఆఫ్ఘన్ బౌలర్లను ఆటాడుకున్నాడు. ఇన్నింగ్స్ లో రోహిత్ 84 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సర్లతో 131 పరుగులు చేశాడు. ఓపెనర్లు ఔటైన తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ జట్టు విజయాన్ని పూర్తి చేశారు. అయితే టీమిండియా మ్యాచ్ గెలిచినా కూడా కెప్టెన్ రోహిత్ శర్మ  విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అతన్ని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఫీల్డింగ్ సెట్ చేయడంలో రోహిత్ తప్పిదం బయటపడింది.

10 నుంచి 40 ఓవర్ల మధ్యలో సర్కిల్ లో ఐదుగురు ప్లేయర్లు ఉండాలి. కానీ నలుగురే ఉన్నారు. అప్పుడు జడేజా 22 ఓవర్ వేస్తున్నాడు. ఈ ఓవర్ సమయానికి నలుగురు ఫీల్డర్లు సర్కిల్ లోపల ఉన్నారు. ఇది గమనించిన ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ ఫీల్డ్ అంపైర్ కు కంప్లైంట్ చేశాడు. దీంతో అంపైర్ జడేజా వేసిన బంతిని నో బాల్ గా ప్రకటించాడు. ఆ బాల్ ను ఆఫ్గాన్ కెప్టెన్ హష్మదుల్లా షాహిది భారీ షాట్ కు ప్రయత్నించగా.. ఎడ్జ్ తీసుకుని బౌండరీ వెళ్ళింది. ఇక ఫ్రీ హిట్ బాల్ ను కూడా భారీ షాట్ ఆడగా.. సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో బాల్ ఫీల్డర్ చేతికి చిక్కింది. ఫ్రీ హిట్ కావడంతో దాన్ని అవుట్ గా ప్రకటించలేదు. అయితే ప్రపంచ లాంటి మెగా టోర్నీలో ఇలా చెత్తగా ఫిల్డింగ్ సెట్ చేస్తావా అంటూ క్రిటిక్స్ రోహిత్ పై ఫైర్ అవుతున్నారు. పవర్ ప్లే లో ఎంత మంది సర్కిల్ లోపల ఉండాలి, ఎంత మంది బయట ఉండాలో తెలీదా? అంటూ కామెంట్ చేస్తున్నారు

Also Red: Telangana Assembly Polls: హైదరాబాద్ నుండి బయటకు వచ్చే దమ్ముందా?