Legends League Cricket 2022: క్రికెట్ అభిమానులకు పండగ.. భారత్‌లోని ఐదు నగరాల్లో లెజెండ్స్ మ్యాచ్‌లు

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహామహులు మరోసారి మైదానంలోకి బరిలో దిగనున్నారు.

Published By: HashtagU Telugu Desk
Legends Imresizer

Legends Imresizer

Legends League Cricket 2022: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహామహులు మరోసారి మైదానంలోకి బరిలో దిగనున్నారు. వయసు మీద పడ్డా ఉత్సాహంతో క్రికెట్ ఆడి అభిమానులను అలరించనున్నారు. ఈ మేరకు లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్‌ఎల్‌సీ) రెండో సీజన్‌ షెడ్యూల్‌ను నిర్వాహకులు విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా ఈ టోర్నీ ఐదు నగరాల్లో జరగనుంది. లీగ్‌ మ్యాచ్‌లు కోల్‌కతా, ఢిల్లీ, కటక్‌, లక్నో, జోధ్‌పూర్ వేదికగా జరగనున్నాయి. . ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సెప్టెంబర్ 16న సెప్టెంబర్ 16న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఓ ఛారిటీ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. ఇండియా మహరాజాస్‌, వరల్డ్‌ జెయింట్స్‌ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఇండియా మహరాజాస్‌ జట్టుకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సారథ్యం వహించనుండగా.. రెస్టాఫ్ వరల్డ్‌ జెయింట్స్‌ను ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ నడిపించనున్నాడు.

కాగా ఇండియా మహరాజాస్‌ జట్టులో వీరేంద్ర సెహ్వాగ్‌, మహ్మద్‌ కైఫ్‌, యూసఫ్‌ పఠాన్‌, సుబ్రహ్మణ్యం బద్రీనాథ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, పార్థివ్‌ పటేల్‌, స్టువర్ట్‌ బిన్నీ, శ్రీశాంత్‌, హర్భజన్‌ సింగ్‌, నమన్‌ ఓజా, అక్షశ్‌ దిండా, ప్రజ్ఞాన్‌ ఓజా, అజయ్‌ జడేజా, ఆర్పీ సింగ్‌, జోగీందర్‌ శర్మ, రితేందర్‌ సింగ్‌ సోధి ఉన్నారు. అటు సెప్టెంబర్ 17 నుంచి అసలు టోర్నీ ప్రారంభం కానుంది. కోల్‌కతా వేదికగా సెప్టెంబర్ 17 నుంచి 18 వరకు, లక్నో వేదికగా సెప్టెంబర్ 21 నుంచి 22 వరకు, ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు, కటక్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు, జోధ్‌పూర్ వేదికగా అక్టోబర్ 1 నుంచి 3 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్లే ఆఫ్ మ్యాచ్‌లు అక్టోబర్ 5 నుంచి 7 వరకు జరుగుతాయి. ఫైనల్ అక్టోబర్ 8న జరగనుంది.

  Last Updated: 24 Aug 2022, 01:12 PM IST