Site icon HashtagU Telugu

IPL Auction: వేలంలో ఫాస్ట్ బౌలర్లదే ఆధిపత్యం.. 100 పైగా కోట్లు ఖర్చు చేసిన ఫ్రాంచైజీలు

IPL 2026 Auction

IPL 2026 Auction

IPL Auction: మెగావేలంలో (IPL Auction) ఐపీఎల్‌ ఫీవర్ మొదలైంది. సీజన్ ఎప్పుడెప్పుడా అని క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే దానికింకా నాలుగు నెలల సమయముంది. ఈ సారి ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసే విషయంలో చాలా జాగ్రత్త పడ్డారు. 10 జట్లు కలిసి మొత్తం 639.15 కోట్లు వెచ్చించి 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 10 ఫ్రాంచైజీలు కలిసి మొత్తం 8 RTMలను ఉపయోగించాయి. అయితే ఈ ఆక్షన్ లో ఫాస్ట్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. ఫాస్ట్ బౌలర్ల కోసం ఫ్రాంచైజీలు ఉదారంగా డబ్బు ఖర్చు చేశాయి. వేలంలో టాప్-5 అత్యంత ఖరీదైన ఫాస్ట్ బౌలర్లు ఎవరో చూద్దాం.

టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మెగా వేలంలో చరిత్ర సృష్టించాడు. పంజాబ్ కింగ్స్ RTM ద్వారా 18 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఫాస్ట్ బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ నిలిచాడు. న్యూజిలాండ్ అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చాడు. వేలంలో 12.50 కోట్లు పెట్టి కివీస్ బౌలర్‌ను ముంబై చేర్చుకుంది. బోల్ట్ జస్ప్రీత్ బుమ్రా కలిస్తే ముంబై బౌలింగ్ దళం ఏ విధంగా మారుతుందో ఉచించవచ్చు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ చివరి క్షణంలో వేలంలో చేరాడు.

Also Read: District Tour : జనవరి నుండి జిల్లాల పర్యటన.. జగన్‌ కీలక ప్రకటన

అతని ప్రభావం ఏంటో వేలంలో స్పష్టంగా కనిపించింది. ఆర్చర్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. చివరికి రాజస్థాన్ రాయల్స్ అతడిని 12.50 కోట్లకు తమ జట్టులో చేర్చుకుంది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్‌ను వేలంలో కొనుగోలు చేసింది. హేజిల్‌వుడ్‌ కోసం ఆర్‌సీబీ 12.50 కోట్లను వెచ్చించింది. ఆర్సీబీలో చేరిన భువనేశ్వర్ కుమార్‌ మరియు హేజిల్‌వుడ్‌ జోడీ చెలరేగితే ప్రత్యర్థి బ్యాటర్లకు తిప్పలు తప్పవు.

ఆర్సీబీ విడుదల చేయడంతో మహ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్ జట్టుతో జతకట్టాడు. సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్ 12.25 కోట్లకు కొనుగోలు చేసింది. కీలక సమయంలో సిరాజ్ బౌలింగ్ దమ్మెంటో అందరికీ తెలిసిందే. ఈ ఐదుగురు బౌలర్ల స్పెషాలిటీ ఏంటంటే.. వీరంతా స్పీడ్‌తో పాటు స్వింగ్‌ను ఉపయోగించి ప్రత్యర్థుల్ని కన్ఫ్యూజ్ చేయగలరు.వీళ్ళతో పాటు మిచెల్ స్టార్క్, టీ నటరాజన్, మహ్మద్ షమీ, ప్రసిద్ క్రిష్ణ, దీపక్ చహర్ వంటి ఆటగాళ్లు భారీ ధరలకు అమ్ముడయ్యారు.దాదాపు ఫాస్ట్ బౌలర్ల కోసమే ఫ్రాంచైజీలు 150 కోట్లు ఖర్చు చేశాయి.

Exit mobile version