Site icon HashtagU Telugu

Akash Deep : నాలుగో టెస్టులో ఆ పేసర్ అరంగేట్రం

Akash Deep

Akash Deep

ఇంగ్లాండ్‌(England)తో నాలుగో టెస్టు (Fourth Test)కు టీమిండియా (Team India) రెడీ అవుతోంది. ఇప్పటికే రాంఛీ (Ranchi) చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌ మొదలుపెట్టాయి. అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం కనబరిచిన రోహిత్‌సేన రాజ్‌కోట్ (Rajkot) టెస్టులో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. అటు బజ్‌బాస్ కాన్సెప్ట్‌తో అడుగుపెట్టి బోల్తా పడిన ఇంగ్లీష్ టీమ్‌కు వరుసగా రెండు ఓటములు మింగుడుపడడం లేదు. బజ్‌బాల్‌ ఆటపై విమర్శలు వస్తున్నా ఇదే కొనసాగిస్తామని ఇంగ్లాండ్ కోచ్ మెక్‌కల్లమ్ స్పష్టం చేసిన నేపథ్యంలో రాంఛీలో ఎలాంటి ఫలితం వస్తుందనేది చూడాలి. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌కు భారత స్టార్ పేసర్ బూమ్రా దూరమయ్యాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా అతనికి విశ్రాంతిచ్చారు. ఈ నేపథ్యంలో బూమ్రా స్థానంలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ప్లేస్ కోసం ముకేశ్ కుమార్, ఆకాశ్‌దీప్‌ పోటీ పడుతున్నారు. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి తొలి సారి టీమిండియా పిలుపును అందుకున్న బెంగాల్ పేసర్, ఆకాశ్ దీప్ అరంగేట్రం చేయనున్నట్టు తెలుస్తోంది. . అతనికి ముకేష్ కుమార్ నుంచి పోటీ ఎదురు కానున్నా… టీమిండియా మేనేజ్‌మెంట్ ఆకాశ్‌దీప్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో భారత్ ఏ తరఫున బరిలోకి దిగిన ఆకాశ్ దీప్ 11 వికెట్లు తీసాడు. మరోవైపు ముకేష్ కుమార్ సైతం బిహార్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. అయితే వైజాగ్ టెస్ట్‌లో మాత్రం ముకేష్ కుమార్ తేలిపోయాడు. దీంతో అతనికి చోటు కష్టమేనని తెలుస్తోంది. అదే సమయంలో రివర్స్ స్వింగ్ రాబట్టడంలో ఆకాశ్ దీప్ దిట్ట. ఇప్పటి వరకు అతను 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 23.58 యావరేజ్‌తో 104 వికెట్లు తీసాడు. ఒకవేళ ఆకాశ్ దీప్.. నాలుగో టెస్ట్‌లో బరిలోకి దిగితే.. ఈ సిరీస్‌లో మూడో అరంగేట్ర భారత ప్లేయర్‌గా నిలుస్తాడు. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. రాంచీ టెస్ట్‌లో విజయం సాధించి 3-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. కాగా ఈ మ్యాచ్‌కు కెఎల్ రాహుల్ గాయంతో దూరమవగా..గత మ్యాచ్‌లో రాణించిన సర్ఫ్‌రాజ్‌ఖాన్, ధృవ్‌ జురెల్‌తో పాటు జైశ్వాల్‌పై భారీ అంచనాలున్నాయి.

Read Also : Ashika Ranganath : ఆషిక వర్క అవుట్ వీడియో చూశారా..?