WTC Final 2023: పుజారా చెత్త షాట్.. మండిపడుతున్న నెటిజన్లు

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్‌లో ఛెతేశ్వర్ పుజారాను టీమిండియా ట్రంప్ కార్డ్‌గా పరిగణించారు. పుజారా చాలా కాలంగా ఇంగ్లండ్‌లో

WTC Final 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్‌లో ఛెతేశ్వర్ పుజారాను టీమిండియా ట్రంప్ కార్డ్‌గా పరిగణించారు. పుజారా చాలా కాలంగా ఇంగ్లండ్‌లో ఉండి కౌంటీ క్రికెట్‌లో ఆడుతున్నాడు. అయితే టైటిల్ పోరులో పుజారా అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. టెస్టు స్పెషలిస్ట్‌గా పేరుగాంచిన పుజారా తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులకే ఔట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో చెత్త షాట్ ఆడి విమర్శలపాలయ్యాడు. దీంతో అతనిపై సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

శుభ్‌మన్ గిల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన చెతేశ్వర్ పుజారా మెల్లిగా ఆట మొదలు పెట్టాడు. అయితే పాట్ కమిన్స్ వేసిన బంతిని పుజారా చెత్తగా ఆడాడు. నిజానికి పుజారా కమిన్స్ బౌన్స్ బాల్‌పై అప్పర్ కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి అతని బ్యాట్ లోపలి అంచుని తీసుకుని అలెక్స్ కారీ గ్లోవ్స్‌లోకి వచ్చి పడింది. దీంతో పుజారా 27 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. 43 బంతులు ఎదుర్కొని 27 పరుగులలో 5 ఫోర్లు సాధించాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఫ్లాప్ కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు పుజారాపై విరుచుకుపడ్డారు.

Read More: Long Overdue: 81 ఏళ్ళ తర్వాత లైబ్రరీకి చేరుకున్న పుస్తకం.. చివరికి ఏం జరిగిందంటే?