Site icon HashtagU Telugu

Virat Kohli: కోహ్లీ ఆటిట్యూడ్ కామెంట్స్ పై ఫ్యాన్స్ ఫైర్

Virat Kohli

Virat Kohli

Virat Kohli: ఐపీఎల్ చరిత్రలో ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నాయి. అయితే విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య వివాదం ఐపీఎల్ టోర్నీలో ప్రకంపనలు సృష్టించింది. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ కూడా ఈ వివాదంలోకి తలదూర్చాడు. ఈ వివాదం 2023 ఐపీఎల్ లో జరిగింది. మైదానంలో నవీన్, కోహ్లి వాగ్వాదానికి దిగగా, ఆ సమయంలో అమిత్ మిశ్రా నవీన్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తున్నాడు. కాగా తాజాగా ఈ వివాదంపై మరియు విరాట్ కోహ్లీ గురించి అమిత్ మిశ్రా సంచలన విషయాలను పంచుకున్నాడు.

కోహ్లి, నవీన్ మధ్య వివాదం తర్వాత నవీన్ కోహ్లీని గౌరవించలేడని అమిత్ మిశ్రా అభిప్రాయపడ్డాడు. కోహ్లి లాంటి స్టార్ ఆటగాడు యువ ఆటగాడిని దుర్భాషలాడడం మంచి సంప్రదాయం కాదని అమిత్ మిశ్రా తెలిపాడు. అలాగే కోహ్లీ గురించి ఇంకా చాలానే చెప్పుకొచ్చాడు.ఇండియన్‌ క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ను ఎంతోమంది వ్యక్తిగతంగా ఆరాధిస్తారు. రాహుల్‌ ద్రవిడ్‌, సౌరవ్‌ గంగూలీని కూడా అలాగే ఎడ్మైర్‌ చేస్తారు. అలాగే ధోని గురించి కూడా పాజిటివ్ గానే చెప్తుంటారు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మని కూడా అందరూ ఇష్టపడతారు. తాజాగా రోహిత్ పై ద్రవిడ్ చేసిన చేసిన కామెంట్స్ ఒక్కసారి గుర్తు చేసుకుంటే.. రోహిత్‌ చాలా మంచి వాడని, ఒక వ్యక్తిగా అతన్ని మిస్‌ అవుతానని ద్రవిడ్ ఎమోషనలయ్యాడు. అయితే ఇలా వీళ్లందరి గురించి గొప్పగా భావించే వాళ్ళు కోహ్లీ విషయంలో అలా ఫీల్ అవ్వల్లేరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మిశ్రా.

అందరితో గొడవలు పెట్టుకోవడం, గర్వంతో వ్యవహరించడంతోనే మిగతా క్రికెటర్లకు దక్కినంత గౌరవం కోహ్లీకి దక్కడం లేదని అన్నాడు. అసలు కోహ్లీ గురించి ఎవరేమనుకుంటున్నారో పక్కన పెడితే కోహ్లీపై మిశ్రా చేసిన కామెంట్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మిశ్రాపై కోహ్లీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అమిత్ మిశ్రా భారత్ తరఫున 22 టెస్ట్‌లు, 33 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. అలాగే కోహ్లీ సారథ్యంలో 9 టెస్ట్‌లు, 7 వన్డేలు, 2 టీ20లు ఆడాడు.

Also Read: Gautam Gambhir: వైరల్ అవుతున్న గంభీర్ కేకేఆర్ వీడ్కోలు వీడియో