Site icon HashtagU Telugu

Virat Kohli: ఛేజింగ్‌లో తగ్గేదే లే.. దటీజ్ కింగ్ కోహ్లీ..!

Virat Kohli

Virat Kohli

Virat Kohli: యుద్ధంలో రాజు ప్రత్యర్థులను వేటాడుతుంటే మిగిలిన సైన్యానికి వచ్చే ఉత్సాహమే వేరు.. విరాట్ కోహ్లీకి ఇది సరిగ్గా సరిపోతుంది… దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పంజాబ్ కింగ్స్ పై కోహ్లీ (Virat Kohli) డాషింగ్ ఇన్నింగ్స్…పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్నప్పటకీ ఒకప్పటి విరాట్ ను గుర్తుకుతెస్తూ దుమ్మురేపాడు. పంజాబ్ పై బెంగళూరుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. డుప్లెసిస్ , గ్రీన్ నిరాశపరిచిన వేళ… ఛేజింగ్ లో తనను కింగ్ అని ఎందుకంటారో కోహ్లీ మరోసారి నిరూపిస్తూ రెచ్చిపోయాడు.కోహ్లీ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడాడు. తన మార్క్ డ్రైవ్‍లతో పాటు దూకుడైన షాట్లతో దుమ్మురేపాడు. ఏ దశలోనూ రన్‍రేట్ తగ్గకుండా ఆడాడు. దీంతో 31 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు. చాలారోజుల తర్వాత ఫ్నాన్స్ కు విరాట పర్వాన్ని చూసే అవకాశాన్ని దక్కింది.

Also Read: Kalki: కల్కి మూవీ రైట్స్ కోసం యుద్ధం చేస్తున్న ఓటీటీ సంస్థలు.. ఎన్ని కోట్లో తెలుసా?

తన లాంటి బ్యాటర్ ఇచ్చిన క్యాచ్ జారవిడిస్తే మ్యాచ్ ను చేజార్చుకున్నట్టేనని రుజువు చేశాడు. ఎందుకంటే కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ను ఆరంభంలోనే బెయిర్ స్టో వదిలేశాడు. ఫలితంగా పంజాబ్ ఓటమికి ఇదే టర్నింగ్ పాయింట్ గా చెప్పొచ్చు. ఈ లైఫ్ ను సద్వినియోగం చేసుకున్న కోహ్లీ కళ్లుచెదిరే షాట్లతో ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చాడు. ఆహా ఇదే కదా మాకు కావాల్సింది అంటూ ఫ్యాన్స్ స్టేడియంలో ఊగిపోతూ విరాట్ బ్యాటింగ్ ను ఆస్వాదించారు. అసలే కోహ్లీ…ఆపై చిన్నస్వామి స్టేడియం.. అన్నింటికీ మించి ఛేజింగ్.. ఇక అభిమానుల జోష్ గురించి చెప్పాలా…అందుకే రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీ క్రీజులో ఉన్నంత సేపూ విరాట జపంతో స్టేడియం హోరెత్తిపోయింది. కోహ్లీ 49 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. చివర్లో కోహ్లీ ఔటైన తర్వాత కాసేపు టెన్షన్ నెలకొన్నా దినేశ్ కార్తీక్, లామ్రోర్ మ్యాచ్ ను ఫినిష్ చేశారు.

We’re now on WhatsApp : Click to Join

Exit mobile version