Kohli Jersey in Pakistan: అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్న విరాట్ కోహ్లి (Virat Kohli) కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. శత్రు దేశం పాకిస్థాన్‌లోనూ విరాట్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటి వరకు పాక్ గడ్డపై కోహ్లీ ఒక్క మ్యాచ్ ఆడకపోయినా కోట్లలో అతనిని అభిమానిస్తారు. కోహ్లీ తొలిసారిగా 2006లో భారత అండర్ 19 జట్టు తరఫున పాకిస్థాన్ పర్యటనకు వెళ్ళాడు. అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా పాక్ గడ్డపై అడుగుపెట్టలేదు. అయితే తన అసాధారణ ప్రదర్శనతో పాక్ క్రికెట్ ఫ్యాన్స్ కు ఫెవరెట్ క్రికెటర్ అయ్యాడు.
కోహ్లీపై ఉన్న అభిమానంతో పాకిస్థానీలు కోహ్లీ జెర్సీలు ధరించి మైదానానికి వచ్చిన ఎన్నో సందర్భాలు చూశాం. తాజాగా పాకిస్తాన్ లో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ కప్ జరుగుతుంది. బాబర్ ఆజం నుంచి షాహీన్ అఫ్రిది వరకు స్టార్ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఈ టోర్నీ సందర్భంగా కోహ్లీ వీరాభిమాని తన జెర్సీ (Jersey)తో కనిపించాడు. సొంత దేశంలో కోహ్లీ జెర్సీని ధరించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అభిమాని విరాట్ కోహ్లీ నంబర్ 18 జెర్సీతో సాండ్స్ లో సందడి చేశాడు. పాక్ ఆటగాళ్లు బౌన్దరీలు బాడుతుతుంటే అతను మాత్రం కోహ్లీ కోహ్లీ అంటూ ఛాంట్స్ చేయడం ఆకట్టుకుంది. ఎంత అభిమానం ఉంటే సొంత దేశంలో విదేశీ ఆటగాడిని ఇలా అభిమానిస్తారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
శ్రీలంక పర్యటన అనంతరం లండన్ వెళ్లిన కోహ్లీ బాంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం ఇప్పటికే చెన్నై శిభిరంలో చేరాడు.సెప్టెంబరు 19 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. నిన్న ప్రాక్టీస్ సెషన్లో కోహ్లీ సిక్సర్ల మోత మోగించాడు. ఓ బంతిని బలంగా బాదగా బంతి గోడకు తగిలి రంధ్రం పడింది. దీన్ని బట్టి విరాట్ ఎంత ప్రమాదకర ఫామ్‌లో ఉన్నాడో అంచనా వేయవచ్చు. బంగ్లాదేశ్‌తో ఆడే టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లి అద్భుతమైన రికార్డు సృష్టించే అవకాశం ఉంది. కోహ్లీ ఇప్పటివరకు 26942 అంతర్జాతీయ పరుగులు చేశాడు. ఇప్పుడు చెన్నై టెస్టులో 58 పరుగులు సాధిస్తే అంతర్జాతీయంగా 27 వేల పరుగులకు చేరువవడంతో పాటు ఆ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు 623 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.
Also Read: Team India Superstar: గిల్ కి జై కొట్టిన ట్రావిస్ హెడ్