Site icon HashtagU Telugu

MS Dhoni : అభిమాని ఇచ్చిన గిఫ్ట్ చూసి ఆశ్చర్యపోయిన ధోనీ.. ఇంతకీ అదేంటో చూడండి..

Fan Gifted Chepauk Stadium Model to Mahendra Sing Dhoni

Fan Gifted Chepauk Stadium Model to Mahendra Sing Dhoni

మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni).. భారత క్రికెట్ టీమ్ లో క్రికెట్ అభిమానుల్లో ఆ పేరుకున్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది ఐపీఎల్(IPL) మ్యాచ్ లలో ధోని ఎప్పుడు గ్రౌండ్ కి వచ్చినా అభిమానులంతా మొబైల్స్ లో టార్చ్ లు వేసి.. ఒక రాజుకి స్వాగతం పలుకుతున్నట్లుగా మహేంద్రుడిని స్వాగతించారు. ఇక ఇప్పటికే ధోని సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్(CSK) టీం ప్లే ఆఫ్స్ కు చేరింది.

ధోని తన స్టైల్ క్రికెట్ తోనే కాదు, గుణంతో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవల ఓ వీరాభిమాని ధోనీకి చెన్నైలోని చెపాక్ స్టేడియం సూక్ష్మ నమూనాను బహుమతిగా అందించాడు. ఆ బహుమతిని చూసిన ధోని ఆనందం అంతా ఇంతా కాదు. ఆ సూక్ష్మ నమూనాను చూస్తూ చాలా ఆనందించాడు ధోనీ.

ఇప్పుడు ఆ వీడియో ఇన్‌స్టాగ్రామ్ లోని ధోనీ ఫ్యాన్ పేజ్ లో ఉండగా ఆ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ధోని తన అభిమాని ఇచ్చిన బహుమతిని చూసి ఆశ్చర్యపోతూ ఆనందించారు. ఇప్పటి వరకూ ఈ వీడియోకు 1 మిలియన్ కు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన మహేంద్రుడి అభిమానులు.. అతని నవ్వుల్ని చూసి ఆనందపడ్డారు. బహుమతి అదిరిపోయిందని ఆ అభిమానిని మెచ్చుకుంటున్నారు సాటి ధోని అభిమానులు.

 

Also Read :  David Warner: ఐపీఎల్‌లో 500+ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా డేవిడ్ వార్నర్