IPL 2025: గత ఐపీఎల్ ఎడిషన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అంతకుముందు సీజన్లో తొలుత కెప్టెన్ పగ్గాలను జడేజాకు అప్పగించగా, ఆ బాధ్యతను జడ్డు సరిగా నిర్వర్తించలేకపోయాడు. దీంతో ధోనీ మళ్ళీ కెప్టెన్ పగ్గాలను తీసుకుని ఆ ఎడిషన్లో చెన్నైని చెంపియన్ గా నిలబెట్టాడు. అయితే 2024 ఐపీఎల్ లో ఋతురాజ్ కెప్టెన్ అయినప్పటికీ ధోనీ వికెట్ల వెనుక నుంచి కెప్టెన్సీ చేశాడు.
గత సీజన్‌లో గైక్వాడ్ 14 మ్యాచ్‌లలో సిఎస్కె కెప్టెన్‌గా వ్యవహరించాడు. 7 మ్యాచ్‌లలో జట్టును విజయపథంలో నడిపించగలిగాడు. మరో 7 మ్యాచ్‌లలో చెన్నై ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. గైక్వాడ్ కెప్టెన్సీలో చెన్నై ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. ఓవరాల్ గా గతేడాది ఐపీఎల్లో గైక్వాడ్ కెప్టెన్సీ ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. 2025 ఐపీఎల్ మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.నిజానికి, ఫాఫ్ గత 3 సీజన్‌లుగా ఆర్సీబీకి కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే అతని కెప్టెన్సీలో ఫ్రాంచైజీ ట్రోఫీ కరువును తీర్చలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీలో కెప్టెన్ మార్పు తథ్యంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఫాఫ్ డు ప్లెసిస్ వేలంలోకి వెళ్లే అవకాశముంది. ఇదే జరిగితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అతనిని తమ జట్టులో తీసుకునే ఛాన్స్ ఉంది.
ఫాఫ్ చెన్నై డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా కాలం గడిపాడు. ఆ జట్టు సభ్యులతో డుప్లిసిస్ కు మంచి అనుబంధం ఉంది. ఆర్సీబీ అతడిని వద్దనుకుంటే కచ్చితంగా చెన్నై ముందుకు వస్తుంది. అంతేకాదు వచ్చే సీజన్లో చెన్నై ఫాఫ్ డుప్లిసిస్ను కెప్టెన్ చేయొచ్చు. ఇదే జరిగితే చెన్నైకి డుప్లిసిస్, ఆర్సీబీకి కేఎల్ రాహుల్ కెప్టెన్లుగా ఉండొచ్చు.
Also Read: Indonesia Earthquake: ఇండోనేషియాలో 5.0 తీవ్రతతో భూకంపం