Site icon HashtagU Telugu

Dhoni Captainship: చెన్నై విజయ రహస్యం అతడే – డుప్లెసిస్

Dhoni As Uncapped Player

Dhoni As Uncapped Player

ఐపీఎల్‌ 2022లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్యరసవత్తర పోరు జరగనుంది.
అయితే ఈ మ్యాచ్ ముందు ఆర్సీబీ కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీపై ప్రశంసల జల్లును కురిపించాడు. కొన్ని సీజన్ల పాటు ధోనితో కలిసి ఉన్నాను. అతడి సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ లో ఎలాంటి మార్పులు జరిగాయో చూశాను. ఓడిపోతానుమనుకున్న మ్యాచ్‌లలో అనూహ్య విజయాలు నమోదు చేశాడు. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే సీఎస్‌కే విజయాల వెనుక ధోని తప్ప ఎలాంటి రహస్యం లేదు. మహీ జట్టులో ఉంటే ఆటగాళ్లందరూ తమలోని అత్యుత్తమ ఆటతీరునూ ప్రదర్శిస్తారు.ధోనీ సారథ్యంలో సీఎస్‌కే మరింత పటిష్టంగా తయారైందనడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జరిగిన మ్యాచే ఉదాహరణ అని డుప్లెసిస్ అన్నాడు. ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఎదుర్కొనేందుకు తాము తీవ్రంగా శ్రమించక తప్పదని డుప్లెసిస్ పేర్కొన్నాడు.
ఐపీఎల్‌-2021లో డుప్లెసిస్‌ సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఐపీఎల్‌ మెగా వేలం-2022 నేపథ్యంలో సీఎస్‌కే అతడిని రిటైన్‌ చేసుకోకపోవడంతో వేలంలోకి వచ్చాడు.. దీంతో డుప్లెసిస్‌ను 7 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్సీబీ అతడిని కెప్టెన్‌గా నియమించింది.

ఈ సీజన్‌లో10 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు జట్టు 5 మ్యాచుల్లో ఓడి.. మిగతా 5 మ్యాచ్‌లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది. ఇక చెన్నై జట్టు ఈ సీజన్ లో 9 మ్యాచ్‌లు ఆడితే మూడింట గెలిచి.. 6 మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. ప్రస్తుతం 6 పాయింట్లతో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్ ఆశలు నిలబెట్టుకోవాలంటే ఆర్సీబీతో ఈ రోజు జరిగే మ్యాచ్ కీలకంగా మారనుంది.