IPL 2023: ఈ సీజన్ లో అత్యంత భారీ సిక్సర్ ఇదే..

2023: ఐపీఎల్​ 16వ సీజన్​లో భాగంగా బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్​లో బెంగళూరు ప్లేయర్లు విరాట్​ కోహ్లీ, డుప్లెసిస్​, మాక్స్​వెల్​ విధ్వంసకర ఇన్నింగ్స్ తో లక్నో బౌలర్లకు చుక్కలు చూపించారు.

  • Written By:
  • Publish Date - April 11, 2023 / 07:21 AM IST

Faf du Plessis hits longest six of IPL 2023: ఐపీఎల్​ 16వ సీజన్​లో భాగంగా బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్​లో బెంగళూరు ప్లేయర్లు విరాట్​ కోహ్లీ, డుప్లెసిస్​, మాక్స్​వెల్​ విధ్వంసకర ఇన్నింగ్స్ తో లక్నో బౌలర్లకు చుక్కలు చూపించారు. ఫేవరేట్ స్టేడియం కావడంతో టాప్ ఆర్డర్ చెలరేగిపోయింది. ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డారు.

అయితే నిన్న జరిగిన మ్యాచులో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ హైలైట్ గా నిలిచాడు. బిష్ణోయ్ వేసిన 15 ఓవర్లో భారీ సిక్సర్ కొట్టాడు. బంతి ఏకంగా స్టేడియం బయట పడింది. ఆ సిక్స్ చూసిన సగటు ఆర్సీబీ అభిమానికి పూనకాలు వచ్చినంత పనైంది. దాదాపు 115 మీటర్ల మేర గాల్లో జర్నీ చేసింది ఆ బంతి. ఈ సిక్స్ ఐపీఎల్ హిస్టరీలోనే పదవ భారీ సిక్సర్ కాగా.. ఈ సీజన్లో ఇదే అత్యంత భారీ సిక్సర్ గా రికార్డులకెక్కింది.

2018 లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మోర్కెల్ బాదిన సిక్స్ ఇప్పటివరకు అత్యంత భారీ సిక్సర్ గా నమోదైంది. ఏకంగా 125 మీటర్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. 2013 సీజన్లో పంజాబ్ ప్లేయర్ ప్రవీణ్ 124 మీటర్ల భారీ సిక్సర్ తో మైదానాన్ని దాటించాడు. 2011 సీజన్లో గిల్ క్రిస్ట్ 122 మీటర్ల సిక్స్ కొట్టగా …2010లో టీమిండియా ప్లేయర్ ఊతప్ప 120 మీటర్ల సిక్స్ కొట్టాడు. 2013 ఐపీఎల్ సీజన్లో విండీస్ విద్వంసకరుడు 119 మీటర్ల సిక్స్. 2009లో యువరాజ్ సింగ్ 119 మీటర్లు, 2008 లో టేలర్ 119 మీటర్లు, 2016లో బెన్ కట్టింగ్ 117 మీటర్ల సిక్సర్, 2013లో టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ 117 మీటర్ల భారీ సిక్స్ తో స్టేడియాన్ని దాటించేశాడు.

ఇక నిన్న జరిగిన మ్యాచులో సిక్సర్ల మోత మోగింది. ఫాఫ్ డుప్లెసిస్ 5 సిక్సర్లు బాదగా … మాక్స్​వెల్​ 6 సిక్సర్లు కొట్టాడు. ఇక కింగ్ కోహ్లీ తన విశ్వరూపాన్ని మరోసారి రుచి చూపించాడు. 4 సిక్సర్లతో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే ఆర్సీబీ భారీ టార్గెట్ ను లక్నో వీరోచిత పోరాటంతో అద్భుత విజయాన్ని అందుకున్నది. ఏ మాత్రం విజయ అవకాశాలు లేని సమయంలో నికోలస్ పూరన్ వచ్చి మ్యాచ్ రూపురేఖల్ని మార్చేశాడు. బెంగుళూరు రాయల్స్ ఛాలెంజర్స్ తో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో లక్నో…1 వికెట్ తేడాతో విజయం సాధించింది. 213 పరుగుల టార్గెట్ ను లక్నో సరిగ్గా 20 ఓవర్లలో ఛేదించింది.