Site icon HashtagU Telugu

T20 World Cup 2022: ఆ బౌలర్లను తక్కువ అంచనా వేయకండి.. పాక్ మాజీ పేసర్ ఆసక్తికర కామెంట్స్..!

Team India

India team

T20 ప్రపంచ కప్ 2022లో అక్టోబర్ 23(ఆదివారం)న భారత్‌- పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. 2022 టీ20 ప్రపంచకప్‌లో ఇండియా-పాక్‌ల మధ్య పోరుకు ముందు బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్‌ను భారత బౌలింగ్ యూనిట్ గురించి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఆకిబ్ జావేద్ హెచ్చరించాడు.

భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ వంటి బెస్ట్ సీమర్ల నుంచి నుంచి పాకిస్థాన్ బ్యాటర్స్ గట్టి సవాలును ఎదుర్కోనున్నారు అని జావేద్ చెప్పాడు. ఈ ఇద్దరు బౌలర్లు సీమ్ పరిస్థితులను ఉపయోగించుకోని ప్రత్యర్థి జట్టును ఇబ్బందులకు గురిచేసే సత్తా ఉందని తెలిపాడు.
పాకిస్తాన్ బ్యాటింగ్ యూనిట్ ఓపెనర్లు బాబర్, మహ్మద్ రిజ్వాన్‌లపై ఎక్కువగా ఆధారపడుతుంది. భారత బౌలర్లు ఆరంభంలోనే వికెట్లు తీస్తే పాకిస్థాన్ మిడిల్ ఆర్డర్ కష్టాలలో పడే అవకాశం ఉందని పేర్కొన్నాడు.

మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ చాలా మంచి సీమ్ బౌలర్లు. ఆస్ట్రేలియా పిచ్ మీద ఎలా బౌలింగ్ చేయాలో, ఏ ఏరియాల్లో బౌలింగ్ చేస్తే వికెట్లు పడతాయో వాళ్లకి తెలుసు. ఈ ఇద్దరి బౌలింగ్‌లో పాక్ బ్యాటర్లు ఇబ్బంది పడడం ఖాయం. షమీకి ఆస్ట్రేలియా పిచ్‌లపై ఆడిన అనుభవం కూడా చాలా ఉపయోగపడుతుందని అన్నాడు. కాగా.. భువనేశ్వర్ ఈ ఏడాది 24 టీ20ల్లో 7.21 ఎకానమీ రేటుతో ఇప్పటికే 32 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా ప్లేస్‌లో సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి చోటు దక్కినా.. అతను ఈ ఏడాది ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు.