Site icon HashtagU Telugu

India WTC Final Hopes: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో టీమిండియా, అదెలాగంటే ?

Prize Money

Prize Money

India WTC Final Hopes: గత కొన్నేళ్లుగా టీమిండియాను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (India WTC Final Hopes) ఊరిస్తూ వస్తుంది. టీమిండియా రెండుసార్లు ఫైనల్ చేరినా భంగపాటు తప్పలేదు. ముచ్చటగా మూడోసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలన్న భారత్ ఆశలకు అడిలైడ్ టెస్ట్ ఓటమి ఇబ్బందికరంగా మారింది. అడిలైడ్‌లో ఓటమి తర్వాత టీమిండియా డబ్ల్యూటీసీ రేసులో వెనుకబడింది. ఓ దశలో వరుసగా ఆరు టెస్టు విజయాలతో డబ్ల్యూటీసీ పట్టికలో తిరుగులేని ఆధిక్యంలో కొనసాగిన రోహిత్ సేన ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకోవడం కష్టతరంగా మారింది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్ గెలవాలన్న కోహ్లీ, రోహిత్‌ల కల నెరవేరకుండా పోతుంది.

రెండో టెస్ట్ ఓటమి తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ మొదటి స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోగా దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి చేరుకుంది. అలాగే ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతుంది. అయినప్పటికీ డబ్ల్యూటీసీ ఫైనల్ కు భారత్ కు అవకాశముందంటున్నారు విశ్లేషకులు. మరి టీమ్ ఇండియా ఫైనల్‌కు ఎలా చేరుకోగలదో చూద్దాం. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ కు ముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ టూర్లో భారత్ అన్ని మ్యాచ్‌లు గెలవాలని మాట్లాడుకున్నాం. కానీ ఈ సిరీస్ లో ఇంకా మూడు మ్యాచ్ లు మిగిలే ఉన్నాయి. ఐదు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచాం. సో ఇప్పుడు భారత్ కనీసం 2 మ్యాచ్‌లు గెలిచి 1 మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలి. అప్పుడు భారత్ రెండో స్థానానికి చేరుతుంది.

Also Read: WhatsApp: వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ సేవలకు అంతరాయం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా సత్తా చాటితే అప్పుడు శ్రీలంకలో 2-0తో గెలిచినా ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు తక్కువే. అయితే శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాను 1-0తో ఓడించినట్లయితే టీమిండియా ఫైనల్స్‌కు చేరుకోగలదు. మరోవైపు పాక్‌తో జరిగే రెండు టెస్టుల్లోనూ దక్షిణాఫ్రికా ఓడిపోవాలని భారత్ కోరుకోవాలి. ఇవన్నీ జరిగితే టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుతుంది. భారత్ ఆస్ట్రేలియా హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే మొత్తం 109 మ్యాచ్‌లు ఆడాయి. భారత్ 33 మ్యాచ్‌లు గెలిచింది. ఆస్ట్రేలియా 46 మ్యాచ్‌లు గెలిచింది. ఇది కాకుండా 29 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

Exit mobile version