భారత్, ఆస్ట్రేలియా (Melbourne Test) మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో నాలుగో టెస్ట్ మ్యాచ్ మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఓపెనర్ ఎవరు? ఈ ప్రశ్న చాలా మంది క్రికెట్ అభిమానుల మదిలో మెదులుతుంది. ఆస్ట్రేలియా టూర్‌లో గత 3 మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా రాణించారు.
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో రాహుల్, యశస్వి కలిసి 201 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో రోహిత్ శర్మ తిరిగి వచ్చినప్పటికీ అతను 6వ నంబర్‌లో బ్యాటింగ్ చేశాడు. అయితే రెండో టెస్టులో రాహుల్, యశస్వి జోడీ శుభారంభం ఇవ్వలేకపోయినా.. మూడో టెస్టులో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ భారత్‌కు భారీ ఇన్నింగ్స్ ఆడాడు.అందువల్ల మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగే నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో కూడా రాహులే ఓపెనింగ్ పాత్ర పోషించవచ్చు. ఈ పరిస్థితుల్లో రోహిత్ తన స్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంది.
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ 1-1తో సమమైంది. ఇప్పుడు మెల్‌బోర్న్‌లో ఎవరు గెలిస్తే వారే సిరీస్‌లో ముందంజ వేస్తారు. ఈ పరిస్థితిలో రెండు జట్లూ తమ అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌తో మైదానంలోకి రావాలని కోరుకుంటున్నాయి. అయితే నాలుగో మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో టీమిండియాలో ఎలాంటి మార్పులు జరగకపోవచ్చు. బౌలింగ్ దళం విషయానికి వస్తే.. బుమ్రా జట్టును ముందుకు నడిపిస్తుండగా ఆకాష్ దీప్, సిరాజ్, నితీష్, జడ్డు రాణిస్తున్నారు. అయితే బ్యాటింగ్ విషయంలో పుంజుకోవాల్సి ఉంది. తొలి టెస్టు మ్యాచ్‌ని పక్కన పెడితే.. ఆ తర్వాత భారత బ్యాట్స్‌మెన్ పూర్తిగా ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. కాబట్టి తదుపరి టెస్ట్ మ్యాచ్‌లో పరుగులు చేయాల్సిన బాధ్యత భారత బ్యాట్స్‌మెన్‌ల భుజాలపై ఉంది.