Site icon HashtagU Telugu

T20 World Cup 2022: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు స‌ర్వం సిద్ధం.. మ‌రో రెండు రోజులు మాత్ర‌మే..!

Icc Announces Warm Up Fixtures Of T20 World Cup 2022 1280x720

Icc Announces Warm Up Fixtures Of T20 World Cup 2022 1280x720

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు స‌ర్వం సిద్ద‌మైంది. మ‌రో రెండు రోజుల్లో ఈ పొట్టి ఫార్మాట్ పోరు ప్రారంభంకానుంది. ఇప్ప‌టికే అన్ని దేశాలు ఆస్ట్రేలియా చేరుకుని వార్మ‌ప్ మ్యాచ్‌లు, ప్రాక్టీస్ సెష‌న్‌లు ముమ్మ‌రం చేశాయి. ఈసారి ఎలాగైనా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను సాధించాల‌నే క‌సితో 16 జ‌ట్లు బ‌రిలోకి దిగుతున్నాయి. ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రగనున్న ఈ టోర్నీలో ఈనెల 16న అంటే ఆదివారం రోజు తొలి మ్యాచ్ శ్రీలంక‌- న‌మిబీయా జ‌ట్ల మ‌ధ్య ప్రారంభం కానుంది. న‌వంబ‌ర్ 13న ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గనుంది.

ఇప్ప‌టికే ప్రాక్టీస్ మ్యాచ్‌ల‌తో ప్ర‌పంచ‌క‌ప్ సంద‌డి మొద‌లైంది. ఇక సూప‌ర్-12కు అర్హ‌త సాధించేందుకు తొలి రౌండ్‌లో మ్యాచ్‌లు ఉత్కంఠ‌భ‌రితంగా ఉండ‌నున్నాయి. సూప‌ర్-12 పోరుకు ముందు తొలి రౌండ్ మ్యాచ్‌లు జ‌ర‌గనున్నాయి. అయితే ఇండియా, పాకిస్థాన్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్ జ‌ట్లు సూప‌ర్‌-12కు అర్హ‌త సాధించాయి. సూప‌ర్-12లో మ‌రో 4 స్థానాలు ఖాళీగా ఉండ‌టంతో ఆ స్థానాల కోసం తొలి రౌండ్‌లో 8 మంది జ‌ట్లు పోటీప‌డ‌నున్నాయి.

ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌ర‌గనున్న ఈ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఎనిమిదోది. 2007లో ఈ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ మొద‌లైంది. అయితే ఈ టీ20 వ‌ర‌ల్డ్ టైటిల్‌ను ఇప్ప‌టివ‌ర‌కు వెస్టిండీస్ (2012, 2016) రెండు సార్లు సాధించింది. భార‌త్ (2007), పాకిస్థాన్ (2009), ఇంగ్లండ్ (2010), శ్రీలంక (2014), ఆస్ట్రేలియా (2021) ఒక్కోసారి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను సాధించాయి. అయితే న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్ జ‌ట్లు ఒక్క‌సారి కూడా క‌ప్పును సాధించ‌లేక‌పోయాయి.