సరిగ్గా పదకొండేళ్ల కిందట ఏప్రిల్ 2న టీమిండియా కెప్టెన్‌గా ఉన్నఎంఎస్ ధోని సిక్స్ కొట్టి భారత జట్టుకు వన్డే ప్రపంచ కప్‌ను అందించిన చారిత్రక ఘట్టాన్ని ఎవరూ మరిచిపోలేరు. 2011 ఏప్రిల్ 2న ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన ధోనిసేన 28 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచకప్ అందుకుంది. ఇక ఆరోజు శ్రీలంకతో ఫైనల్లో ఎంఎస్ ధోని కొట్టిన విన్నింగ్ సిక్స్ ఎప్పటికీ మరచిపోలేము. ఆ ఫైనల్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన ధోని 90 పరుగులతో అజేయంగా నిలిచి చరిత్రలో నిలిచిపోయాడు. ధోని ఆడిన ఇన్నింగ్ వల్లే టీమిండియా ఆ వరల్డ్ కప్‌ను సాధించిందంటూ అభిమానులు ధోనీపై పొగడ్తల వర్షం కురిపించారు
అయితే తాజాగా ఈ అంశంపై టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ స్పందించాడు. ధోనీ వల్లే టీమిండియా 2011 వరల్డ్ కప్ గెలిచిందనడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నాడు.తాజాగా ఓ కార్యక్రమంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. టీమిండియా ప్రపంచ కప్ గెలవడానికి ధోనీ ఒక్కడే కారణం సరైంది కాదు. మేమియు కలిసి కట్టుగా ఆడడం వల్లే వరల్డ్ కప్ గెలువగలిగాం. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. ధోనీ ఒక్కడే మ్యాచ్ గెలిపించాడంటే.. మిగిలిన ఆటగాళ్లు ఏం కావాలి ఆ మ్యాచ్ లో గంభీర్ 97 పరుగులు చేశాడు లగే మిగిలిన ఆటగాళ్లు కూడా కలిసికట్టుగా రాణించారు. ఇందులో ప్రత్యేకంగా ధోని చేసిందేమి లేదు అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇక తొలిసారి కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు 1983లో వన్డే వరల్డ్ కప్‌ను సొంతం చేసుకోగా.. రెండో సారి ఎంఎస్ ధోని సారథ్యంలోని టీమిండియా వరల్డ్ కప్ ను అందుకుంది.