Dating : హార్దిక్ పాండ్యతో డేటింగ్? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Dating : ఈ కామెంట్లతో 2018లో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారానికి ముగింపు పలికినట్టయింది. సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్య పర్సనల్ లైఫ్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా అవుతూనే ఉంటుంది

Published By: HashtagU Telugu Desk
Esha Hardik

Esha Hardik

బాలీవుడ్ మోడల్, నటి ఈషా గుప్తా (Esha Gupta) తన గ్లామరస్ లుక్స్‌కి, సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్‌లకు ప్రసిద్ధి. 2018లో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య(Hardik Pandya)తో ఆమె డేటింగ్‌లో ఉందన్న వార్తలు బాగా చర్చకు వచ్చాయి. తాజాగా ఈషా గుప్తా ఈ విషయంపై స్పందించారు. యూట్యూబ్ చానెల్ లో సిద్ధార్థ్ కనన్‌తో చేసిన ఇంటర్వ్యూలో, ఆమె హార్దిక్‌తో జరిగిన పరిచయం గురించి చెప్పుకొచ్చింది.

Sourav Ganguly: ఐసీసీ చైర్మ‌న్ జై షాపై గంగూలీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

“ఆ సమయంలో మేమిద్దరం కొద్ది నెలల పాటు మాట్లాడుకున్నాం. రెండు సార్లు కలిశాం కానీ, ఇది అసలు డేటింగ్ అనడానికి కూడా కుదరదు. ‘అవుతుందేమో, కావొచ్చేమో’ అనే దశలోనే ఆ బంధం ముగిసిపోయింది. ఎటువంటి గొడవలు లేకుండా సహజంగా ముగిసిపోయింది. నేనూ అతడూ చాలా భిన్నమైన వ్యక్తులు. అతను నా టైప్ కాదు, నేనూ అతని టైప్ కాను అని రెండో నెలకే స్పష్టమైంది” అని ఆమె తెలిపింది. ఫ్యాషన్ ప్రపంచం మీద కాకుండా కుటుంబ జీవితం, సాధారణత మీద అతడికి ఆసక్తి ఎక్కువని ఈషా పేర్కొంది.

ఈ కామెంట్లతో 2018లో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారానికి ముగింపు పలికినట్టయింది. సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్య పర్సనల్ లైఫ్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా అవుతూనే ఉంటుంది. కాగా, ప్రస్తుతం హార్దిక్ తన ప్రొఫెషనల్ కెరీర్‌పై ఫోకస్ పెట్టగా, ఈషా గుప్తా కూడా వెబ్‌సిరీస్‌ల ద్వారా తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.

  Last Updated: 25 Jun 2025, 09:39 AM IST