టీమిండియా నాగ్ పూర్ టెస్టులో గెలవడంతో ఐసీసీ రేటింగ్ పాయింట్లు (ICC Rating Points) మెరుగవడం.. ర్యాంకింగ్స్ లో ఆసీస్ ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ కు వెళ్లిందని అభిమానులు సంబరపడ్డారు. అయితే వారి ఆనందాన్ని ఐసీసీ నాలుగు గంటల్లోనే ఆవిరి చేసింది. కేవలం సాంకేతిక తప్పిదం కారణంగానే భారత్ నంబర్ వన్ స్థానానికి చేరిందని వివరణ ఇచ్చింది. అనంతరం తప్పిదాన్ని సవరించి మళ్లీ టెస్ట్ ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది.తమ రేటింగ్ పాయింట్ల లెక్కల్లో తప్పిదంతో ఈ గందరగోళం చోటు చేసుకుందని ఐసీసీ వివరణ ఇచ్చింది. ప్రస్తుత టెస్టు ర్యాంకింగ్స్ లో ఆ్రస్టేలియా 126 రేటింగ్‌తో టాప్ ర్యాంక్‌లో, భారత్ 115 రేటింగ్‌తో రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. కాగా ఐసీసీ తప్పిదం పై భారత ఫ్యాన్స్ మండి పడుతున్నారు. అంతర్జాతయ క్రికెట్ సమాఖ్య ఇలాంటి తప్పిదం చేయడమా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read: Spot Fixing: ఉమెన్స్ టీ20 ప్రపంచకప్‌లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం
ఇప్పటికే వన్డేలు, టీ20ల్లో టీమ్‌ఇండియా నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. రోహిత్ సేన రెండో టెస్టులో గెలిస్తే అప్పుడు టెస్టుల్లోనూ అగ్రస్థానాన్ని దక్కించుకుంటుంది. మరోవైపు టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో స్పిన్నర్ అశ్విన్ రెండో ర్యాంకు అందుకున్నాడు. మోకాలి శస్త్రచికిత్స నుంచి కోలుకుని నాగ్ పూర్ టెస్టులో అదరగొట్టిన జడేజా బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 16వ స్థానానికి చేరుకున్నాడు. ఇక తొలి టెస్టులో శతకం చేసిన రోహిత్ శర్మ బ్యాటర్ల జాబితాలో రెండు స్థానాలు మెరుగై ఎనిమిదో ర్యాంకులో నిలిచాడు. అటు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆటకు దూరమైన పంత్ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అక్షర్ ఆరు స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలో నిలిచాడు.