ఐపీఎల్ ప్రారంభమైంది. రెండు నెలల పాటు సాగే ఈ ధనాధన్ లీగ్ లో ఈ సారి ఎంతమంది తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటారో చూడాలి. ఇప్పటివరకు ముగిసిన 17 సీజన్లలో ఎంతోమంది యువ ఆటగాళ్లు రాణించి ఇప్పుడు టీమిండియాకి ఆడుతున్నారు. నిజానికి తమ టాలెంట్ ని నీరుపించుకోవడానికి ఐపీఎల్ బెస్ట్ ఫ్లాట్ ఫార్మ్. బీసీసీఐ కూడా ఐపీఎల్ లో రాణించిన ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పటికే చాలా మంది ఆటగాళ్ళు తమ ప్రతిభను మెరుగుపరుచుకుని అంతర్జాతీయ స్థాయికి ఎదగడం మనం చూశాం.
హార్దిక్ పాండ్యా నుండి యశస్వి జైస్వాల్, జస్ప్రీత్ బుమ్రా వరకు ఐపీఎల్ నుండి వచ్చి టీమిండియాలో స్థానం సంపాదించుకున్నవాళ్ళే. కొంతమంది ఆటగాళ్లు విజయవంతమైన కెప్టెన్లుగా మారడానికి కూడా ఐపీఎల్ తోడ్పడింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తరం ముగిసింది. ఇప్పుడు జట్టుకి యువ రక్తం అవసరం. తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రింకు సింగ్ ఐపీఎల్ లో సత్తా చాటుతున్నారు. గతేడాది వేలంలో రాజస్థాన్ రాయల్స్ కోటి రూపాయలకు వైభవ్ ని తమ జట్టులో చేర్చుకున్న విషయం తెలిసిందే. బీహార్ వాసి అయిన వైభవ్ 12 సంవత్సరాల 284 రోజుల వయస్సులో బీహార్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. ఇప్పుడు ఐపీఎల్ కి సెలెక్ట్ అయ్యాడు. వైభవ్ ఐపీఎల్ వంటి భారీ వేదికపై మంచి ప్రదర్శన కనబరిస్తే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. 18 ఏళ్ళ ఆండ్రీ సిద్ధర్థ్ ను చెన్నై కొనుగోలు చేసింది. సిద్ధర్థ్.. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో, ధోనీ మార్గదర్శకంలో కచ్చితంగా రాణిస్తాడని భావిస్తున్నారు. అయితే తుది జట్టులో అవకాశం వచ్చినా రాకపోయినా ఈ ఐపీఎల్ ఆండ్రీ సిద్ధర్థ్ కి కెరీర్ పరంగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. 20 ఏళ్ళ ముషీర్ ఆల్ రౌండర్ గా రాణిస్తున్నాడు. అతడిని 30 లక్షలకు పంజాబ్ దక్కించుకుంది. గతేడాది రంజీలో ముంబై తరుపున డబుల్ సెంచరీతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో, రికి పాంటింగ్ మరదర్శకంలో అదరగొట్టేందుకు తనకిది మంచి అవకాశం.
గతేడాది యూపీ టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను మీరట్ మావెరిక్స్ గెలుచుకోవడంలో స్వస్తిక్ చికారా కీలక పాత్ర పోషించాడు. ఈ 19 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన పరంగా మొదటి స్థానంలో నిలిచాడు. కాగా స్వస్తిక్ ఇప్పుడు ఐపీఎల్ లో రాణిస్తే తన క్రికెట్ కెరీర్ కు బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. స్వస్తిక్ గతేడాది ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు. అయితే తుది జట్టులో అవకాశం రాలేదు. 18వ సీజన్‌కు ముందు అతడిని ఢిల్లీ విడుదల చేయగా ఆర్సీబీ అతడిని 30 లక్షలకు తీసుకుంది. అయితే స్వస్తిక్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే, టీమిండియాకు ఆడాలన్న తన కల నిరవేర్చుకోవడానికి మార్గం సుగమం అవుతుంది.