Site icon HashtagU Telugu

England : సౌతాఫ్రికాపై టెస్ట్ సిరీస్ ఇంగ్లాండ్ దే

England Test Series

England Test Series

సొంతగడ్డపై మరోసారి తమకు తిరుగులేదని ఇంగ్లీష్ టీమ్ రుజువు చేసింది. గత కొంతకాలంగా టెస్ట్ సిరీస్ లలో అద్భుతంగా రాణిస్తున్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు తాజాగా మరో సిరీస్ ను కైవసం చేసుకుంది. సౌతాఫ్రికాపై 2-1తో టెస్ట్ సిరీస్ గెలుచుకుంది. రెండురోజులు ఆట జరగకున్నా చివరి టెస్టులో ఫలితం వచ్చింది. విజయం కోసం 130 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ నాలుగో రోజే గెలుపును ఖాయం చేసుకుంది. చివరి రోజు మరో 33 రన్స్ చేసి సిరీస్ ను సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 118 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లీష్ బౌలర్లలో రాబిన్ సన్ 5 , బ్రాడ్ 4 , ఆండర్సన్ 1 వికెట్ తీసారు. అయితే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో తడబడినా 40 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో ఆ జట్టు 158 రన్స్ కు ఆలౌటైంది.

తర్వాత రెండో ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా బ్యాటర్లు మరోసారి చేతులెత్తేశారు. కెప్టెన్ ఎల్గర్ 36 రన్స్ తప్పిస్తే.. మిగిలిన వారంతా విఫలమయ్యారు. దీంతో రెండో ఇన్నింగ్స్ లోనూ సఫారీ జట్టు కనీసం 200 స్కోర్ చేయలేకపోయింది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి 169 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ పేసర్లకే అన్ని వికెట్లూ దక్కాయి. బ్రాడ్ 3, స్టోక్స్ 3, రాబిన్ సన్ 2 , ఆండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత 130 పరుగుల టార్గెట్ ను ఇంగ్లీష్ టీమ్ సునాయాసంగా ఛేదించింది. తొలి టెస్టులో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 12 రన్స్ తేడాతో గెలిస్తే… రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను సమం చేసింది. చివరి టెస్టులో బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ సిరీస్ ను గెలుచుకుంది.

Exit mobile version