Site icon HashtagU Telugu

England Travel To Abu Dhabi: రెండో టెస్టు త‌ర్వాత అబుదాబి వెళ్ల‌నున్న ఇంగ్లండ్ జ‌ట్టు.. కార‌ణ‌మిదే..?

England

England

England Travel To Abu Dhabi: విశాఖపట్నం టెస్టు ముగిసిన తర్వాత ఇంగ్లండ్ జట్టు అబుదాబి (England Travel To Abu Dhabi)కి వెళ్లనుంది. ఫిబ్రవరి 2 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు జరగనుండగా.. ఈ టెస్టు మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ జట్టు విశ్రాంతి కోసం అబుదాబికి వెళ్లనుంది. భారత పర్యటనకు ముందు అబుదాబిలో ఇంగ్లండ్ జట్టు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్పోర్ట్స్ టైగర్ నివేదిక ప్రకారం.. విశాఖపట్నం టెస్టు ముగిసిన తర్వాత ఇంగ్లండ్ జట్టు అబుదాబికి బయలుదేరనుంది. ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్ జట్టు ఈ 10 రోజుల విరామం అబుదాబిలో త‌మ కుటుంబ స‌భ్యుల‌తో గ‌డ‌ప‌నున్నారు.

ఇంగ్లండ్ జట్టు అబుదాబిలో ప్రాక్టీస్

సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టు భారత్‌కు బదులుగా అబుదాబిలో ప్రాక్టీస్ చేసిందని తద్వారా భారతదేశంలోని పరిస్థితులను అర్థం చేసుకోవచ్చని వారి అభిప్రాయం. అబుదాబి, భారత్‌ల పరిస్థితులు దాదాపు ఒకే రకంగా ఉండడంతో ఇంగ్లండ్‌ భారత్‌కు రాకముందే అక్కడ ప్రాక్టీస్ చేస్తూ సిరీస్‌కు సిద్ధమైంది.

Also Read: Irfan Pathan Wife : తొలిసారి భార్య ఫొటోను షేర్ చేసిన ఇర్ఫాన్.. సఫా బేగ్ ఎవరు ?

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు 1-0తో ముందంజలో ఉంది

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు 1-0తో ముందంజలో ఉంది. భారత్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టులో ఇరు జట్లు తలపడుతున్నాయి. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగుల ఆధిక్యం సాధించింది.

We’re now on WhatsApp : Click to Join

వైజాగ్ టెస్టులో భార‌త జ‌ట్టు భారీ ఆధిక్యం దిశ‌గా దూసుకెళ్తోంది. మూడో రోజు ఆట లంచ్‌ బ్రేక్‌ సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఈ వార్త రాసే స‌మ‌యానికి క్రీజులో శుబ్‌మన్‌ గిల్‌ (83), అక్షర్‌ పటేల్‌ (15) పరుగులతో ఉన్నారు. ప్ర‌స్తుతానికి రోహిత్ సేన‌ 308 ప‌రుగుల‌ ఆధిక్యంలో ఉంది.