England Style:టెస్టుల్లో టీ ట్వంటీ తరహా ఆట

టెస్ట్ మ్యాచ్ అంటే జిడ్డు బ్యాటింగ్...అప్పుడప్పుడు సింగిల్స్..ఎపుడైనా ఫోర్... ఇదీ సహజంగా ఏ జట్టు ఆడే తీరు.

  • Written By:
  • Publish Date - June 28, 2022 / 11:49 AM IST

టెస్ట్ మ్యాచ్ అంటే జిడ్డు బ్యాటింగ్…అప్పుడప్పుడు సింగిల్స్..ఎపుడైనా ఫోర్… ఇదీ సహజంగా ఏ జట్టు ఆడే తీరు. ఇక బ్యాటింగ్ పిచ్ అయితే చెప్పాల్సిన పనే లేదు…మ్యాచ్ ఫలితం రాదు…అందుకే టీ ట్వంటీలు వచ్చిన తర్వాత టెస్ట్ ఫార్మాట్ కు ఆదరణ తగ్గింది..అయితే కొన్ని పెద్ద జట్లు తలపడినప్పుడు మాత్రం ఫాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ క్రికెట్ ను కొత్త పుంతలు తొక్కిస్తోంది.
టీ ట్వంటీల తరహాలో ప్రత్యర్ధిపై విరుచుకుపడుతూ టెస్ట్‌ క్రికెట్‌లో వేగాన్ని మరింత పెంచేస్తుంది. తాజాగా న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్ట్‌ సిరీస్‌ లో ఇంగ్లాండ్ టీ ట్వంటీ తరహా ఆట చూపించింది. కొత్త కెప్టెన్‌ , కొత్త కోచ్‌ ఆధ్వర్యంలో ఇంగ్లండ్‌ ఊహించని విధంగా రెచ్చిపోయింది.

మూడు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లను అలవోకగా ఛేదించిందంటే ఇంగ్లీష్ టీమ్ బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లాండ్ విధ్వంసకర బ్యాటింగ్ లో జానీ బెయిర్‌స్టోదే కే రోల్. సాధారణంగా టెస్ట్ మ్యాచ్ ల్లో బ్యాటర్ స్ట్రైక్ రేట్ 50 లేదా 60కి మించదు. అలాంటిది మూడు మ్యాచ్ ల్లోనూ బెయిర్‌స్టో స్ట్రైక్ రేట్ 120కి పైగా సాగింది. 3 మ్యాచ్‌ల్లో అతను 120కి పైగా స్ట్రయిక్‌ రేట్‌తో 2 సెంచరీలు, ఓ హాఫ్‌ సెంచరీతో 394 రన్స్ చేశాడు. బేయిర్ స్టో తర్వాత మాజీ రూట్ , కెప్టెన్ బెన్ స్టోక్స్ అదరగొట్టారు.
స్టోక్స్‌ 5 ఇన్నింగ్స్‌ల్లో 82.55 స్ట్రయిక్‌ రేట్‌తో 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 194 పరుగులు సాధించాడు. రూట్‌ 6 ఇన్నింగ్స్‌ల్లో 99 సగటున 74 స్ట్రయిక్‌ రేట్‌తో 396 పరుగులు సాధించి సిరీస్‌లో టాప్‌ 2 రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. స్టోక్స్‌ 5 ఇన్నింగ్స్‌ల్లో 82.55 స్ట్రయిక్‌ రేట్‌తో 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 194 పరుగులు సాధించాడు. వీరిద్దరూ బెయిర్ స్టోతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి వరుస విజయాల్లో కీలక పాత్ర పోషించారు. సొంత గడ్డపై ఇంగ్లాండ్ గెలుపు ఊహించిందే అయినా ఈ స్థాయిలో వరల్డ్ ఛాంపియన్ టీమ్ ను చిత్తు చేస్తుందని అది కూడా టీ ట్వంటీ తరహా వినోదాన్ని అభిమానులకు అందిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. మొత్తం మీద టెస్ట్ ఫార్మాట్ కు ఈ సీరీస్ తో సరికొత్త ఊపు వచ్చిందని చెప్పొచ్చు.