Site icon HashtagU Telugu

India vs England:కోహ్లీ, పాండ్యా హాఫ్ సెంచరీలు.. ఇంగ్లాంట్ టార్గెట్ 169

Cropped

Cropped

అడిలైడ్ వేదికగా జరుగుతున్న టీ ట్వంటీ వరల్డ్‌కప్ సెమీఫైనల్లో టీమిండియా 169 పరుగుల టార్గెట్‌ ను ఇంగ్లాండ్ ముందుంచుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ త్వరగానే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. రాహుల్ 5 , రోహిత్ శర్మ 27 పరుగులకు ఔటయ్యారు. ఫామ్‌లో ఉన్న కోహ్లీ మరోసారి ఆదుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ నిరాశపరిచినా…పాండ్యాతో కలిసి 61 పరుగులు జోడించాడు. విరాట్ 39 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. కోహ్లీకి ఈ ప్రపంచకప్‌లో ఇది నాలుగో హాఫ్ సెంచరీ. అలాగే అంతర్జాతీయ టీ ట్వంటీల్లో విరాట్ 4 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. అటు పాండ్యా కూడా మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. పంత్ 6 రన్స్ చేసి ఔటైనప్పటకీ… పాండ్యాకు స్ట్రైకింగ్ ఇచ్చే ఉద్ధేశంతో తన వికెట్‌ త్యాగం చేసాడు. పాండ్యా జోరుకు భారత్ చివరి 5 ఓవర్లలో 68 పరుగులు చేసింది.
దీంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. పాండ్యా 33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగులు చేయగా.. కోహ్లీ 40 హంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 50 రన్స్ చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 , రషీద్ 1 , క్రిస్ వోక్స్ 1 వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో భారత్ వికెట్ కీపర్‌గా పంత్‌నే కొనసాగించింది. అటు ఇంగ్లాండ్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. డేవిడ్ మలాన్, మార్క్ వుడ్ దూరమవడంతో క్రిస్ జోర్డాన్, ఫిల్ సాల్ట్ జట్టులోకి వచ్చారు.

Exit mobile version