Site icon HashtagU Telugu

England Cricketer: మాంచెస్టర్‌లో చిక్కుకున్న ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్‌.. కార‌ణ‌మిదే..?

England Cricketer

Ipl 2023.. No Bowling For ‘injured’ Ben stokes

England Cricketer: ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ (England Cricketer) జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా ప్ర‌స్తుతం క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. క్రికెట్‌కు దూరంగా ఉన్న తర్వాత స్టోక్స్ అమెరికాలోని మాంచెస్టర్‌లో తన కుటుంబంతో సెలవులు గడపడానికి వెళ్ళాడు. కానీ ఇప్పుడు బెన్ స్టోక్స్ మాంచెస్టర్‌లో చిక్కుకున్నాడు. అతని కుటుంబం మాంచెస్టర్‌ను విడిచి వెళ్ళడానికి అనుమతించబడినప్పటికీ స్టోక్స్ గ‌త మూడు రోజులుగా మాంచెస్టర్‌లో చిక్కుకున్నాడు. దానికి కారణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వీసా స‌మ‌స్య కార‌ణంగా స్టోక్స్ మాంచెస్ట‌ర్‌లో ఉండాల్సి వ‌చ్చింది. వీసా కార‌ణంగా తాను మాంచెస్ట‌ర్‌లో ఉండిపోవాల్సి వ‌చ్చింద‌ని స్టోక్స్ త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చాడు. దీనిపై అత‌ని అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

బెన్ స్టోక్స్ ఎందుకు ఇరుక్కుపోయాడు..?

బెన్ స్టోక్స్ తన భార్య, ఇద్దరు పిల్లలతో సెలవులు గడపడానికి మాంచెస్టర్‌కు వెళ్లాడు. కానీ ఇప్పుడు వీసా సమస్య కారణంగా స్టోక్స్ అక్క‌డే ఉండిపోయాడు. అతని కుటుంబం మాంచెస్టర్‌ను విడిచిపెట్టింది. మూడు రోజుల పాటు మాంచెస్టర్‌లో చిక్కుకున్న స్టోక్స్ 22.2 కి.మీ ప్రయాణించాడు. అది కూడా కాలినడకన ప్ర‌యాణించాడు.

Also Read: Zomato: జొమాటో మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఫాస్ట్ డెలివరీలు కావాలంటే ఎక్స్‌ట్రా ఫీజు కట్టాల్సిందే..!

స్టోక్స్ టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరం

బెన్ స్టోక్స్ చివరిసారిగా టీమిండియాతో టెస్టు సిరీస్‌లో ఆడాడు. ఈ సిరీస్ సమయంలో స్టోక్స్ మోకాలి గాయంతో బాధపడ్డాడు. ఆ తర్వాత అతనికి శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. శస్త్రచికిత్స నుండి కోలుకోవడానికి స్టోక్స్ 9 నెలల వరకు స‌మ‌యం పట్టవచ్చు. దీంతో అతను IPL 2024, T20 వరల్డ్ కప్ 2024 నుండి తన పేరును ఉపసంహరించుకోవలసి వచ్చింది. దీని గురించి స్టోక్స్ మాట్లాడుతూ.. తాను ఫిట్‌గా ఉండటానికి చాలా కష్టపడుతున్నానని, అందుకే వీలైనంత త్వరగా జట్టులోకి తిరిగి రావ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నాని చెప్పాడు.

We’re now on WhatsApp : Click to Join