IND vs ENG: టెస్ట్ సిరీస్ మధ్యలోనే దుబాయ్ వెళ్తున్న ఇంగ్లాండ్ .. ఎందుకు?

తొలి టెస్ట్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది రోహిత్ సేన. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా సమిష్టిగా రాణించింది. ఫలితంగా 106 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను సమం చేసింది.కాగా గుజరాత్ వేదికగా మూడో టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15న ప్రారంభమవుతుంది

Published By: HashtagU Telugu Desk
IND vs ENG

IND vs ENG

IND vs ENG: తొలి టెస్ట్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది రోహిత్ సేన. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా సమిష్టిగా రాణించింది. ఫలితంగా 106 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను సమం చేసింది.కాగా గుజరాత్ వేదికగా మూడో టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15న ప్రారంభమవుతుంది.

మూడో టెస్ట్ ప్రారంభమవ్వడానికి ఇంకా 9 రోజుల సమయముంది. ఈ నేపథ్యంలో ఇంగ్లిష్ జట్టు షాకింగ్ డెసిసియన్ తీసుకుంది. పర్యటన మధ్యలోనే దుబాయ్ వెళ్లనున్నట్లు విశ్వసనీయ సమాచారం. 9 రోజుల లాంగ్ గ్యాప్ కారణంగా ఇక్కడ ఉండి చేసేదేం లేదు కాబట్టి దుబాయ్ కి చెక్కేయలని అనుకుంటున్నారు. పైగా ఇక్కడ వేసవి కాలం మొదలైంది. ఫిబ్రవరిలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో 9 రోజులు ఖాళీగా ఉండాలంటే వాళ్ళకి కూడా కష్టమే. సో ఈ తొమ్మిది రోజులు తమ కుటుంబ సభ్యులతో గడపాలని భావించిన ఆటగాళ్లు దుబాయ్ వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అక్కడే ప్రాక్టీస్ కూడా చేయనున్నారట.

ఇండియాతో సిరీస్ ప్రారంభానికి ముందే దుబాయ్ లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ లో ప్రాక్టీస్ క్యాంప్ ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇదే గ్రౌండ్ లో ఆ జట్టు ప్రాక్టీస్ చేయనున్నట్లు తెలుస్తోంది. తిరిగి ఫిబ్రవరి 13న రాజ్ కోట్ కు చేరుకుంటారు. ఇదిలా ఉండగా విశాఖపట్నంలో భారత్ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. దీంతో రెండో మ్యాచ్ గెలిచి ఆ రికార్డుని పదిలం చేసుకుంది. ఈ విజయం ద్వారా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్​లో బజ్​బాల్​ ఫార్ములాను చిత్తు చేసిన తొలి ఆసియా కెప్టెన్​గా హిట్​మ్యాన్ అవతరించాడు.దీంతో రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక వైజాగ్ వేదికగా బ్యాటింగ్ లో జైస్వాల్,గిల్ చెలరేగి ఆడారు , బౌలింగ్ లో బుమ్రా, అశ్విన్, కుల్దీప్ వికెట్ల వేట కొనసాగించారు.

Also Read: Angelo Mathews: ఏంజెలో మాథ్యూస్… ఏంటీ దురదృష్టం

  Last Updated: 06 Feb 2024, 06:26 PM IST