Fifa World Cup 2022: ఇంగ్లండ్ భోణీ కొట్టింది… గోల్ కీపర్ ముక్కు పగిలింది…!!

  • Written By:
  • Updated On - November 22, 2022 / 10:51 AM IST

 

దోహాలో జ‌రుగుతున్న ప్రతిష్టాత్మక ఫుట్ బాల్ ప్రపంచకప్‌లో ఇంగ్లండో బోణీ కొట్టింది. ఈ మ్యాచ్ లో ఇరాన్ 2-6తో ఇంగ్లండ్ చేతిలో ఓటమి చవిచూసింది. గ్రూప్ బి లో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్ లో ఇంగ్లండ్ 6-2గోల్స్ తేడాతో ఇరాన్ ను చిత్తుగా ఓడించింది. గతేడాది యూర్ కప్ ఫైనల్లో నిరాశ పరిచిన బుకయో సాకా, మార్కస్, రాష్ ఫోర్ట్ ఈ మ్యాచ్ లో చెలరేగి ఆడారు. బుకయో రెండు గోల్స్ చేయగా..మార్కస్ ఒక గోల్ చేశాడు. మిగతా మూడు గోల్స్ జూడ్ బెలింగమ్ చేశారు. మొత్తానికి బంతిని తమ గుప్పిట్లో పెట్టుకోవడంలో ఇంగ్లండ్ స్ట్రయికర్లు సక్సెస్ అయ్యారు. తొలిఅర్థభాగంలోనే ఇంగ్లండ్ దూసుకుపోయింది.

 

అయితే మ్యాచ్ మొదలైన కొద్దిసేపటికే గోల్ కీపర్ అలీరెజా బరన్వాంద్ ముక్కు పగిలింది. బైర్న్ వాండ్ లాంగ్ త్రోలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఫుట్ బాల్ పిచ్ పై ఇప్పటివరకు నమోదైన త్రోగా ప్రపంచ రికార్డు ఆయన సొంతం. కాగా ఆట 12వ నిమిషంలో సహచర ఆటగాడు మాజిద్ హుస్సేనీని ఢీకొట్టాడు అలీరెజా. దీంతో ఆయన ముక్కుకు తీవ్రగాయమై రక్తస్రావం అయ్యింది. వెంటనే అక్కడికి చేరుకున్న వైద్యులు చికిత్స అందించారు. కానీ 19 వ నిమిషంలో అతను మళ్లీ పిచ్ పై పడిపోయాడు. దీంతో ఆయన మైదానం వీడాడు. ఇరాన్ జట్టులో ఉన్న నలుగురు గోల్ కీపర్లలో ఒకరైన హుస్సేన్ 19వ నిమిషంలో మైదానంలోకి అడుగుపెట్టాడు. ఇక బైర్న్ వాండ్ కూడా తలకు గాయమైంది.