Site icon HashtagU Telugu

AUS vs ENG : యాషెస్ తొలి టెస్టు లో ఇంగ్లాండ్ ఆలౌట్..!

Eng Vs Aus

Eng Vs Aus

పెర్త్‌లో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 164 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌ తొలి రోజు ఆటలో 19 వికెట్లు పడిపోగా.. రెండో రోజు కూడా అదే జరుగుతోంది. ఇరు జట్ల బౌలర్లు.. బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 132 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియా ముందు 205 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.

యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బౌలర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి రోజు ఆటలోనే ఏకంగా 19 వికెట్లు కూల్చిన బౌలర్లు.. రెండో రోజు ఆటలోనూ అదే జోరు కొనసాగిస్తున్నారు. దీంతో పెర్త్ టెస్ట్‌లో 114 ఓవర్లలోనే ఏకంగా 30 వికెట్లు పడిపోయాయి. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 134 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 205 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.

ఓవర్‌ నైట్ స్కోరు 123/9తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా 132 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐదు వికెట్లు తీయగా.. బ్రైడన్ కేర్స్ 3, జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్.. 172 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో అమూల్యమైన 40 పరుగుల లీడ్ ఆ జట్టుకు లభించింది.

రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే స్టార్క్.. బెంబేలెత్తించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లతో సత్తాచాటిన ఈ పేసర్.. రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే జాక్ క్రాలీని ఔట్ చేశాడు. అతడు ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను కళ్లు చెదిరే రీతిలో అందుకున్నాడు. ఈ సమయంలో బెన్ డకెట్ (28), ఓలీ పోప్ (33) నిలబడ్డారు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్ 59/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఆధిక్యం 99 పరుగులకు చేరింది.

లంచ్ తర్వాత సీన్ రివర్స్ అయింది. బోలాండ్ దెబ్బకు ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ కకావికలం అయింది. దీంతో 65/1తో ఉన్న ఆ జట్టు 76/5కి చేరింది. చివర్లో గస్ అట్కిన్సన్ (37), బ్రైడన్ కేర్స్ (20) రాణించడంతో ఇంగ్లాండ్ ఆధిక్యం 200 పరుగుల మార్కును దాటింది. కానీ పది రన్స్‌ వ్యవధిలో చివరి మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్.. 164 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా ముందు 205 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4, స్టార్క్ 3, డాగెట్ 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో స్టార్క్ మొత్తంగా పది వికెట్లు పడగొట్టాడు.

Exit mobile version