World Cup 2023: ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్

ప్రపంచ కప్ కి ఇంకా 24 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. రేపు అక్టోబర్ 5 మధ్యాహ్నం 2 గంటలకు డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్లు మొదటి మ్యాచ్ లో తలపడుతాయి.

World Cup 2023: ప్రపంచ కప్ కి ఇంకా 24 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. రేపు అక్టోబర్ 5 మధ్యాహ్నం 2 గంటలకు డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్లు మొదటి మ్యాచ్ లో తలపడుతాయి. ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. గత ప్రపంచ కప్ లో ఇరు జట్లు ఫైనల్ మ్యాచ్ లో తలపడ్డాయి. అయితే చివరిలో రెండు సార్లు మ్యాచ్ టై అవ్వగా, బౌండరీ కౌంట్ ని బట్టి విజేతను నిర్ణయించారు. అంటే ఇన్నింగ్స్ లో ఎవరు ఎక్కువ ఫోర్లు కొడితే వాళ్ళు విజయం సాధించినట్టు. ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఎక్కువ బౌండరీలు సాధించడంతో విజేతగా నిలిచి మొదటి సారి ప్రపంచ కప్ ని ముద్దాడింది.

ప్రపంచ కప్ 2023 లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మ్యాచ్ ల పై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇరు జట్లలోనూ బలమైన ఆటగాళ్లు ఉన్నారు. అయితే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్‌స‌న్‌, బౌల‌ర్ టిమ్ సౌథీలు జ‌ట్టుకు దూరం అయ్యే ఛాన్స్ ఉంది. ఈ స్టార్ ఆటగాళ్లు గాయాల‌తో ఇబ్బందిప‌డుతున్నారు. న్యూజిలాండ్ టాప్ ఆర్డ‌ర్‌లో డారిల్ మిచ‌ల్‌, డేవ‌న్ కాన్వేలు అద్భుత ఫామ్ లో ఉన్నారు. స్టాండ్ ఇన్ కెప్టెన్ గా టామ్ లాథ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు. జేమ్స్ నీషామ్‌, గ్లెన్ ఫిలిప్స్ లాంటి హార్డ్ హిట్టింగ్ బ్యాట‌ర్లు కూడా ఉన్నారు. బౌలింగ్ విభాగంలో బౌల్ట్ ఫామ్‌లోకి రావ‌డం కివీస్‌కు క‌లిసి వ‌చ్చే అంశ‌మే.ఇంగ్లండ్ జ‌ట్టు మాత్రం మేటి బ్యాట‌ర్ల‌తో బ‌లంగా క‌నిపిస్తోంది. బెన్ స్టోక్స్‌తో పాటు జోస్ బ‌ట్ల‌ర్‌, జానీ బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్‌, జో రూట్‌, డేవిడ్ మ‌లాన్, హ్యారీ బ్రూక్‌ లాంటి భారీ హిట్టర్లు ఆ జ‌ట్టులో ఉన్నారు. ఐపీఎల్‌లో ఆడిన అనుభ‌వం ఉన్న ఇంగ్లండ్ ఆట‌గాళ్ల‌కు ఇండియా పిచ్‌లు మ‌రింత అనుకూలించే అవ‌కాశాలు ఉన్నాయి. మొయిన్ అలీ, క్రిస్ వోక్స్‌, సామ్ క‌ర్ర‌న్ లాంటి ఆల్‌రౌండ‌ర్లతో ఇంగ్లాండ్ టీమ్ కళకళలాడుతుంది.

Also Read: Chandrababu : చంద్ర‌బాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌ను రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు