Site icon HashtagU Telugu

IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీమిండియా రెండో టెస్ట్‌.. ముగ్గురూ ఆట‌గాళ్లు ఔట్‌!

IND vs ENG

IND vs ENG

IND vs ENG: భారత్- ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య రెండో మ్యాచ్ ఈ రోజు అంటే జులై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చాడు.అలాగే సాయి సుదర్శన్‌ను జట్టు నుంచి తప్పించారు. అయితే.. ఇంగ్లండ్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది.

బుమ్రా, సుదర్శన్, శార్దూల్ స్థానంలో వీరికి అవకాశం

జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, శార్దూల్ స్థానంలో శుభ్‌మన్ గిల్ వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్‌దీప్ సింగ్‌లను ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఇచ్చాడు. మిగిలిన జట్టులో ఎలాంటి మార్పులు లేవు. వాషింగ్టన్ సుందర్ రూపంలో గిల్ అదనపు స్పిన్నర్‌ను జ‌ట్టులోకి తీసుకున్నాడు. జడేజాతో పాటు సుందర్ కూడా బౌలింగ్ చేస్తూ కనిపించనున్నాడు. బుమ్రా స్థానంలో ఆకాశ్‌దీప్, శార్దూల్ స్థానంలో వాషింగ్టన్, సుదర్శన్ స్థానంలో నితీష్ రెడ్డికి అవకాశం లభించింది. నితీష్ రెడ్డి కూడా బౌలింగ్‌లో తన వంతు సహకారం అందించగలడు.

Also Read: Pashamylaram Mishap: ఫ్యాక్టరీ బ్లాస్ట్.. తొలి జీతం అందుకోని కార్మికులు, కన్నీటి గాథలు ఇవే!

జోఫ్రా ఆర్చర్ గురించి స్టోక్స్ ఇలా చెప్పాడు

టాస్ తర్వాత బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. మేము బౌలింగ్ చేయబోతున్నాం. పిచ్ పిరిస్థితులు దీనికి అనుకూలంగా ఉన్నాయి. ఆర్చర్‌ను జట్టులోకి తీసుకోవడం గురించి అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్నాం. గత వారం జట్టు ప్రదర్శన చాలా బాగుంది.మాకు విశ్వాసం ఉంది. టెస్ట్ మ్యాచ్‌లో మీరు లోతుగా వెళ్ళే కొద్దీ, పరిస్థితులను మీరు మెరుగ్గా అర్థం చేసుకుంటారని పేర్కొన్నాడు.

రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్

భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టాంగ్, షోయబ్ బషీర్.