Site icon HashtagU Telugu

T20 World cup 2022 : టీ20 ప్రపంచ కప్ విజేత ఇంగ్లండ్..!!

England 1

England 1

టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ను ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో పాక్‌ను నిలువరించింది. పాక్ నిర్థేశించిన^138 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లీష్ టీమ్ ఛేదించింది. హేల్స్ నిరాశపరిచినా… బట్లర్ 26 , బ్రూక్ 20 పరుగులు చేశారు. వీరిద్దరూ ఔటైనప్పటకీ బెన్ స్టోక్స్ , మొయిన్ అలీ ఇంగ్లాండ్‌ను గెలిపించారు. స్టోక్స్ 52 , మొయిన్ అలీ 19 రన్స్‌ చేశారు. ఇంగ్లాండ్ టీ ట్వంటీ ప్రపంచకప్ గెలవడం ఇది రెండోసారి. అంతకుముందు 2010లో ఇంగ్లీష్ టీమ్ టీ ట్వంటీ వరల్డ్‌కప్ గెలిచింది. పాక్ పేలవ ఫీల్డింగ్ కూడా వారి ఓటమికి కారణమైంది.

అంతకుముందు పాక్ బ్యాటింగ్ తేలిపోయింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆ జట్టు 137 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ బాబర్ అజామ్, మసూద్ , షాదాబ్ ఖాన్ తప్పిస్తే మిగిలిన వారంతా విఫలమవడంతో పాక్ పోరాడే స్కోరు చేయలేకపోయింది. గత మ్యాచ్‌లో రాణించిన రిజ్వాన్, బాబర్ జోడీ టైటిల్ పోరులో సరైన ఆరంభాన్నివ్వలేకపోయారు. రిజ్వాన్ 15 రన్స్‌కే ఔటయ్యాడు. బాబర్ అజామ్ 28 బంతుల్లో 32 , మసూద్ 28 బంతుల్లో 38 రన్స్ చేశారు. చివర్లో షాదాబ్ ఖాన్ 14 బంతుల్లో 20 పరుగులు చేయడంతో పాక్ స్కోర్ 130 దాటింది. ఇంగ్లాండ్ బౌలర్లలో శామ్ కురాన్ 12 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

 

Exit mobile version