Site icon HashtagU Telugu

Ravindra Jadeja: జడేజా వన్డే కెరీర్ పై నీలినీడలు..!

Ravindra Jadeja

Ravindra Jadeja

Ravindra Jadeja: శ్రీలంకతో జరగనున్న టి20 మరియు వన్డే సిరీస్‌లకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. రెండు సిరీస్‌లకూ 15 మంది ఆటగాళ్లకు చోటు కల్పించారు. టీ20 సిరీస్కు సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇక రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ వన్డే సిరీస్ ఆడనుండగా, శ్రేయాస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. వన్డే, టీ20 ఫార్మాట్ల కోసం ప్రకటించిన జట్టులో చాలా మంది యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు చోటు దక్కింది. కాగా టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్ నుంచి రిటైరైన జడేజాకు వన్డే జట్టులో చోటు దక్కలేదు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్.

వాస్తవానికి శ్రీలంక టూర్ కోసం మొదటి నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా విశ్రాంతి కోరారు. కానీ రవీంద్ర జడేజా నుంచి అలాంటి ప్రకటన రాలేదు. అయితే గంభీర్ కోరిక మేరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వన్డే సిరీస్‌కు తిరిగి రాగా, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. అటు రవీంద్ర జడేజాను తొలగించారు. వన్డే ఫార్మాట్ నుంచి జడేజాను తప్పించడంపై రకరకాల అనుమానాలు లేవనెత్తుతున్నారు. భవిష్యత్తులో జడేజాకు టెస్టు ఫార్మాట్‌లో మాత్రమే ఆడే అవకాశం లభించే అవకాశం ఉందని కొందరు సీనియర్లు అంటున్నారు. అక్షర్ పటేల్ తో జడేజా స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. వన్డే ఫార్మాట్‌లో జడేజా రికార్డ్స్ ఇలా ఉన్నాయి. 197 వన్డేల్లో 2756 పరుగులు, 13 హాఫ్ సెంచరీలు చేయడమే కాకుండా 220 వికెట్లు పడగొట్టాడు. మరి ఇలాంటి సీనియర్ ప్లేయర్ని పక్కనపెట్టడం ద్వారా బీసీసీఐ సంకేతాలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వన్డేల్లో జడ్డు క్రికెట్ కెరీర్ ముగిసినట్టేనని బాహాటంగానే చెప్తున్నారు. మరి బీసీసీఐ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా కామెంట్ చేయండి.

టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణో అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మొహమ్మద్. సిరాజ్.

వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, ర్యాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.

Also Read: Guru Purnima: గురు పౌర్ణ‌మి ఎందుకు జ‌రుపుకుంటారు..? ఆ రోజు ఏం చేయాలంటే..?