మెల్ బోర్న్ టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy ) భారీ సెంచరీతో హెడ్ లైన్స్ లో నిలిచాడు. మెల్ బోర్న్ పిచ్ పై కెప్టెన్ రోహిత్, కోహ్లి, పంత్, జడేజా, రాహుల్ ఇలా అందరూ ఫ్లాప్ కాగా వాషింగ్టన్ సుందర్ తో కలిసి నితీష్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ అద్భుతమైన సెంచరీతో క్రీడాభిమానులే కాదు క్రీడాకారులు , రాజకీయ ప్రముఖులు సైతం జయహో నితీష్ రెడ్డి అంటూ ప్రశంసిస్తున్నారు. టెస్టు మ్యాచ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చిన నితీశ్ ఇన్నింగ్స్ అతడి కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది.
ఇక నితీశ్ శతకం బాదగానే కామెంట్రీ బాక్సులో ప్రముఖ కామెంటేటర్ రవిశాస్త్రి భావోద్వేగానికి (Ravi Shastri Emotional) గురయ్యారు. కన్నీళ్లు కారుస్తూనే (‘Yeh aankhon mein aansoo wala 100 hai’) ఆయన కామెంట్రీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రవి శాస్త్రిని అభినందిస్తున్నారు. యంగ్ ప్లేయర్లను ఆయన ఎంతో ప్రోత్సహిస్తారని అంటున్నారు. ఇది రాబోయే తరం క్రికెటర్లకు ప్రేరణగా నిలుస్తుందని, కష్టకాలంలో ఆడే ఇన్నింగ్స్‌కు ఉన్న విలువను రవిశాస్త్రి భావోద్వేగంతో అభివర్ణిస్తున్నారు. ఈ సన్నివేశం క్రికెట్ అభిమానుల హృదయాలను తాకింది. ఇటువంటి సంఘటనలు క్రికెట్ క్రీడలోని మానవీయతను చాటిచెప్తాయి. నితీశ్ శతకం టీమ్ ఇండియా విజయంలో కీలకంగా నిలుస్తూ, రవిశాస్త్రి వంటి వ్యక్తులు యువ ఆటగాళ్లకు ప్రోత్సాహకర్తలుగా ఉంటారని నిరూపిస్తోంది. ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ, టీమ్ ఇండియా గెలుపు జైత్రయాత్ర కొనసాగాలని అభిమానులు కోరుతున్నారు.
Emotions erupted when #NitishKumarReddy brought up his maiden Test ton! 🇮🇳💪#AUSvINDOnStar 👉 4th Test, Day 4 | SUN, 29th DEC, 4:30 AM | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/f7sS2rBU1l
— Star Sports (@StarSportsIndia) December 28, 2024
Read Also : Nitish Kumar Reddy Net Worth : నితీష్ కుమార్ రెడ్డి నికర విలువ..