MS Dhoni Lifts Jadeja: విజయం తర్వాత భావోద్వేగంతో జడేజాను ఎత్తుకున్న ధోనీ.. వైరల్ అవుతున్న వీడియో..!

ఈ విక్టరీపై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్‌ను గెలిపించిన జడేజాను ధోనీ ఎత్తుకొని (MS Dhoni Lifts Jadeja) సంబరాలు చేసుకున్నాడు.

  • Written By:
  • Updated On - May 30, 2023 / 06:36 AM IST

MS Dhoni Lifts Jadeja: అహ్మదాబాద్‌లో సోమవారం రాత్రి రవీంద్ర జడేజా రెండు బంతుల్లోనే బ్యాట్‌తో హీరోగా మారాడు. జడ్డూ బ్యాట్‌లో సిక్సర్లు, ఫోర్లు బాదడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ లాంటి ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లో జడేజా తన బ్యాటింగ్‌తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. అహ్మదాబాద్‌ గ్రౌండ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు తమ చిరస్మరణీయ విజయాన్ని జరుపుకున్నారు.

ఈ విక్టరీపై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్‌ను గెలిపించిన జడేజాను ధోనీ ఎత్తుకొని (MS Dhoni Lifts Jadeja) సంబరాలు చేసుకున్నాడు. సాధారణంగా ధోనీ మ్యాచ్ ఓడినా గెలిచినా ఒకేలా కనిపిస్తాడు. కానీ ఈ ఫైనల్లో చెన్నై థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేయడాన్ని ధోనీ స్పెషల్‌గా ఫీలయ్యాడు. రవీంద్ర జడేజాను ధోనీ ఎత్తుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అత్యంత అరుదైన దృశ్యమంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Also Read: IPL FINAL Winner: ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఉత్కంఠ పోరులో నెగ్గి టైటిల్ కైవసం..!

IPL 2023 ఫైనల్ మ్యాచ్ లో చివరి బంతికి రవీంద్ర జడేజా ఫోర్ కొట్టడంతో చెన్నై సూపర్ కింగ్స్ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. సున్నాపై పెవిలియన్‌కు చేరిన తర్వాత నిరాశగా చూస్తున్న ధోనీ ముఖంలో చిరునవ్వు మెరిసింది. జడేజా మొదట మిడిల్ గ్రౌండ్‌లో CSKని ఛాంపియన్‌గా మార్చిన వేడుకను ఘనంగా జరుపుకున్నాడు. ఆపై అతను చెన్నై శిబిరం వైపు పరుగెత్తాడు.

చివరి ఓవర్ థ్రిల్

ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉంది. జడేజా బ్యాట్ పట్టుకుని క్రీజులో నిలబడి ఉండగా, అతనికి శివమ్ దూబే మద్దతుగా నిలిచాడు. హార్దిక్ పాండ్యా చివరి ఓవర్ బాధ్యతను మోహిత్ శర్మకు అప్పగించాడు. మోహిత్ శర్మ వేసిన ఆఖరి ఓవర్‌లో మొదటి బంతికి పరుగులేమీ రాలేదు. రెండో బంతికి సింగిల్ రాగా. మూడో బంతికి కూడా ఒక్క పరుగే వచ్చింది. నాలుగో బంతికి కూడా సింగిల్ మాత్రమే రావడంతో చివరి 2 బంతుల్లో సీఎస్‌కే విజయానికి 10 పరుగులు కావాల్సి వచ్చాయి. ఐదో బంతికి సిక్సర్ బాదిన రవీంద్ర జడేజా, ఆఖరి బంతికి ఫోర్ బాది మ్యాచ్‌ని ముగించాడు..