Site icon HashtagU Telugu

Educate Your Son: కూతుర్ని కాపాడు, కానీ కొడుకుకు మంచి నేర్పు: సూర్య కుమార్ యాదవ్

Suryakumar Yadav

Suryakumar Yadav

Educate Your Son: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా డాక్టర్‌పై జరిగిన దారుణం తరువాత దేశం మొత్తం షాక్‌కు గురైంది. దీనిపై కోల్‌కతాతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పలువురు క్రికెటర్లు కూడా తమ స్పందనను తెలియజేస్తున్నారు. కోల్‌కతా రేప్ అండ్ మర్డర్ కేసుపై టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా స్పందించాడు. సోషల్ మీడియాలో కొడుకులకు అవగాహన కల్పించాలని సూచించారు.

సూర్యకుమార్ యాదవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కథనాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కోల్‌కతా కేసుపై ఆయన స్పందించారు. ‘మీ కూతుళ్లను కాపాడుకోండి’ అని మొదట రాశాడు కానీ సూర్య ఈ లైన్ కట్ చేశాడు. దీని తరువాత “మీ కుమారులకు విద్యతో పాటు బుద్దులు నేర్పండి” అని వ్రాసాడు. మీ సోదరులకు, మీ తండ్రికి, మీ భర్తకు, స్నేహితులకు చదువు చెప్పండి అంటూ సూర్య ఓ పోస్ట్ పంచుకున్నాడు. కాగా సూర్య పెట్టిన ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అయితే సూర్య కంటే ముందే పలువురు క్రికెటర్లు కోల్‌కతా కేసుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని సారథ్యంలో టీమిండియా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ని 3-0తో కైవసం చేసుకుంది. ఇప్పుడు సూర్య త్వరలో దేశవాళీ టోర్నమెంట్ దిలీప్ ట్రోఫీలో ఆడనున్నాడు. దులీప్ ట్రోఫీ 2024లో సూర్యకుమార్ యాదవ్ సి జట్టులో ఉన్నాడు. ఈ జట్టు కమాండ్ రితురాజ్ గైక్వాడ్ చేతిలో ఉంది. సూర్య, రీతురాజ్‌లతో పాటు సాయి సుదర్శన్, రజత్ పటీదార్ మరియు ఉమ్రాన్ మాలిక్ కూడా టీమ్‌లో ఉన్నారు. సెప్టెంబర్ 5 నుంచి దులీప్ ట్రోఫీలో తొలి మ్యాచ్ A, B జట్ల మధ్య జరగనుంది. కాగా, సి జట్టు తన తొలి మ్యాచ్‌ను డి జట్టుతో ఆడనుంది.

సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు టీమ్ ఇండియా తరఫున ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. 37 వన్డే మ్యాచ్‌లు ఆడి 773 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 4 అర్ధ సెంచరీలు సాధించాడు. కాగా అతను ఇప్పటివరకు టీమ్ ఇండియా తరఫున 71 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 4 సెంచరీలు మరియు 20 హాఫ్ సెంచరీల సహాయంతో 2432 పరుగులు చేశాడు. ఇది కాకుండా సూర్య 150 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 3594 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Also Read: MK Stalin : ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ కృతజ్ఞతలు