Sachin Tendulkar: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)ను భారత ఎన్నికల సంఘం ‘ప్రచారకర్తగా’గా ఎంపిక చేసింది. భారత్‌లో వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికి ముందు సచిన్ టెండూల్కర్‌ను భారత ఎన్నికల సంఘం ‘నేషనల్ ఐకాన్’గా చేయడానికి నిర్ణయం తీసుకుంది. క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తులలో సచిన్ టెండూల్కర్ ఒకరు. సచిన్ టెండూల్కర్‌ను ‘నేషనల్ ఐకాన్’గా మార్చడం ద్వారా ఎన్నికలలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు భారత ఎన్నికల సంఘం కృషి చేస్తోంది.
సచిన్ టెండూల్కర్ ద్వారా యువతను ఆకట్టుకునే ప్రయత్నం
ఢిల్లీలోని ఆల్ ఇండియా రేడియో రంగ్ భవన్‌లో బుధవారం సచిన్ టెండూల్కర్.. ఎన్నికల సంఘంతో ఎంఓయూపై సంతకం చేయనున్నారు. ఈ మెమోరాండం రాబోయే 3 సంవత్సరాల పాటు ఉంటుంది. మూడేళ్ల పాటు అమలులో ఉండే ఈ ఒప్పందంలో భాగంగా సచిన్ ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిన ఆవశ్యకతపై ప్రచారం చేస్తారు. నిజానికి 2024 లోక్‌సభ ఎన్నికల్లో యువత భాగస్వామ్యాన్ని వీలైనంతగా పెంచేందుకు భారత ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. ఈ దిశలో సచిన్ టెండూల్కర్‌ను ‘నేషనల్ ఐకాన్’గా చేయాలనే నిర్ణయం చాలా ముఖ్యమైనదని నిరూపించవచ్చు. ఈ ఒప్పందం పట్టణ, నగరాల్లో ఓటింగ్ పట్ల ఆసక్తి చూపని యువతపై ప్రభావం చూపుతుందని ఈసీ పేర్కొంది.
Also Read: India Playing XI: ఐర్లాండ్ మూడో మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్
మాస్టర్ బ్లాస్టర్ కెరీర్
మాస్టర్ బ్లాస్టర్ గా పేరొందిన సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ కెరీర్‌ను 1989లో ప్రారంభించారు. కాగా సచిన్ 2013లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఈ విధంగా సచిన్ టెండూల్కర్ దాదాపు 24 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాడు. అలాగే సచిన్ టెండూల్కర్ 1992 నుండి ప్రపంచ కప్ 2011 వరకు ODI ప్రపంచ కప్ లు ఆడాడు. ఈ విధంగా సచిన్ టెండూల్కర్ 6 వన్డే ప్రపంచకప్‌లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇది కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీల రికార్డును అందుకున్న ఏకైక బ్యాట్స్‌మెన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్. 2008 నుంచి 2013 వరకు ఐపీఎల్‌లో ఆడాడు. మాస్టర్ బ్లాస్టర్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌లో భాగంగా ఉన్నారు.