Site icon HashtagU Telugu

MS Dhoni: ధోని గురించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప..!

Dhoni As Uncapped Player

Dhoni As Uncapped Player

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మార్చి 31 నుండి ప్రారంభమవుతుంది. IPL 2023 ప్రారంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, 4 సార్లు టైటిల్ గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. అంటే, ఈ సీజన్‌లోని తొలి మ్యాచ్‌లోనే హార్దిక్ పాండ్యా తన మాస్టర్ అంటే మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)తో తలపడనున్నాడు. ఇదే ధోనీకి చివరి ఐపీఎల్ కావచ్చు.

హోం గ్రౌండ్‌లో ఆడి ఐపీఎల్‌కు గుడ్‌బై చెబుతానని, ఈసారి చెన్నైలో కూడా సీఎస్‌కే మ్యాచ్‌లు ఆడనుందని మహి ఇప్పటికే చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో ధోనీకి ఇదే చివరి సీజన్ కావచ్చు. తాజాగా రాబిన్ ఉతప్ప, ధోని గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. ఉతప్ప గత సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ధోనీ వింత ఆహారపు అలవాటు గురించి ఉతప్ప వెల్లడించాడు. జియో సినిమాతో జరిగిన సంభాషణలో మహికి సంబంధించిన పలు రహస్యాలను ఉతప్ప బయటపెట్టాడు. ఉతప్ప CSK నుండి IPLలో 2 సీజన్లు ఆడాడు.

Also Read: స్టార్క్ పేస్ కు భారత్ విలవిల.. రెండో వన్డేలో ఆసీస్ ఘనవిజయం

జియో సినిమా ‘మై టైమ్ విత్ హీరోస్’ ఎపిసోడ్ ‘మై టైమ్ విత్ ధోనీ’లో తనతో గడిపిన సమయాన్ని రాబిన్ ఉతప్ప గుర్తు చేసుకున్నారు. ధోనీ వింత ఆహారపు అలవాట్లను బయటపెట్టాడు ఉతప్ప. ఉతప్ప మాట్లాడుతూ.. మాకు ఒక సమూహం ఉంది. ఇందులో ధోనీ, సురేశ్ రైనా, ఆర్పీ సింగ్, పీయూష్ చావ్లా, మునాఫ్ పటేల్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఆహారంలో దాల్ మఖానీ, బటర్ చికెన్, జీరా ఆలూ లాంటివి తరచుగా ఆర్డర్ చేసేవాళ్లం. కానీ, తిండి విషయంలో మాత్రం ధోనీ పూర్తి భిన్నంగా ఉండేవాడు. ఎంఎస్ తినే విషయంలో చాలా దృఢమైన వ్యక్తి. అతను బటర్ చికెన్ తింటాడు కానీ చికెన్ లేకుండా, గ్రేవీతో మాత్రమే! అతను చికెన్ తిన్నప్పుడు, రోటీలు తినడు. ధోని తినే విధానం వింతగా అనిపించవచ్చు. అయితే ఇదే అతని ఫిట్‌నెస్ రహస్యం అని అన్నాడు.

చెన్నై అభిమానుల ముందు తాను రిటైర్ అవ్వాలనే కోరికను ధోనీ గతంలో వెల్లడించాడు. చెన్నై తనకు రెండో ఇంటిలాంటిదని ధోనీ పలు సందర్భాల్లో చెప్పాడు. ఐదవ సారి ఐపీఎల్ టైటిల్ సాధించి ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని ధోని భావిస్తున్నాడు.