Site icon HashtagU Telugu

Guinness World Records: టీమిండియాను అవమానించిన గిన్నిస్‌ రికార్డ్స్‌..!

Team India Vs Aus Imresizer

Team India Vs Aus Imresizer

T20 వరల్డ్‌కప్‌-2022 సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడిపోయిన టీమిండియాను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ దారుణంగా అవమానించింది. “చరిత్రలో అతిసులువైన ఛేదన ఇదేనా?” అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసిరింది. దీంతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయుల మనో భావాలను దెబ్బతీసిన ఈ సంస్థను ఇండియాలో బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 169 పరుగుల లక్ష్యాన్ని జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ కేవలం 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఇంగ్లండ్‌ను ఫైనల్స్ కు తీసుకువెళ్లారు. ఈ ఓటమి రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ప్రతిష్టాత్మక ఐసిసి ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకోలేకపోయింది. సెమీస్ లో ఓటమి తరువాత చాలా మంది మాజీ క్రికెటర్లు, అభిమానులు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా పేలవమైన ప్రదర్శనపై తమ నిరాశను వ్యక్తం చేశారు. అయితే.. సెమీ ఫైనల్ పోరులో భారత జట్టు ఓటమని అవహేళన చేసే అవకాశాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా కోల్పోలేదు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ “చరిత్రలో అతిసులువైన ఛేదన ఇదేనా?” అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసిరింది.

సెమీ ఫైనల్ పోరులో ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్ (80*), అలెక్స్ హేల్స్ (86*) 169 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేదించి తమ జట్టును కేవలం 16 ఓవర్లలో ఒక వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించిన విషయం తెలిసిందే. గురువారం ఇంగ్లాండ్ తో జరిగిన సెమీస్ లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు 12 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 75 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత విరాట్ కోహ్లీతో కలిసి హార్దిక్ పాండ్యా మంచి ప్రదర్శన చేశాడు. పాండ్యా 33 బంతుల్లో 63 పరుగులు, కోహ్లీ 40 బంతుల్లో 50 పరుగులు చేయడంతో జట్టు స్కోరు 20 ఓవర్లలో 168/6కు చేరుకుంది.మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆదివారం జరిగే టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్ పోరులో ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్‌తో తలపడనుంది.