Site icon HashtagU Telugu

Major League Cricket: అమెరికాలో చెన్నై ఆటగాడి కళ్ళు చెదిరే భారీ సిక్సర్

Major League Cricket

New Web Story Copy 2023 07 17t140328.489

Major League Cricket: అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ ఐదవ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్‌పై టెక్సాస్ సూపర్ కింగ్స్ ఓడిపోయింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టెక్సాస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేశారు. అయితే ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డ్వేన్ బ్రావో బౌలర్లపై విరుచుకుపడ్డాడు.39 బంతుల్లో 76 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బ్రావో తన ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, ఆరు సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. బ్రావో మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ వృథా అయిపోయింది. టెక్సాస్ లో ఒకరిద్దరు మినహా ఇతర ఆటగాళ్లు అంతగా ప్రభావం చూపించలేకపోయారు. ఇదిలా ఉండగా ఈ ఇన్నింగ్స్ లో బ్రావో కళ్ళు చెదిరే సిక్సర్ బాదాడు.

అన్రిచ్ వేసిన 17 ఓవర్ రెండవ బంతిని బ్రావో సిక్సర్ కి మలిచాడు. ఆ సిక్సర్ 106 మీటర్ల ఎత్తులో గాల్లో పయనించడం విశేషం. ఈ టోర్నీలో ఇప్పటికేవరకు ఇదే భారీ సిక్సర్ గా నిలిచింది. ప్రస్తుతం ఆ విజువల్స్ సోషల్ మీడియాలో నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. అంత్యంత సిక్సర్ పై ధోనీ ఫాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. విపరీతంగా షేర్స్ చేస్తున్నారు.

Also Read: India vs Pakistan: ఆసియా కప్ 2023లో సెప్టెంబర్ 2న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్..?